Sun. Jun 14th, 2026

    AP POLITICS: రాజకీయాల్లో ఓటమి అనేది ఒక సహజ ప్రక్రియ. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే అంతిమ తీర్పు. ఆ తీర్పును గౌరవించి, ఎక్కడ తప్పు జరిగిందో ఆత్మపరిశీలన చేసుకుని ముందడుగు వేయడం ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తును ఇస్తుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఘోరమైన పరాజయాన్ని రుచి చూపించినా, వైసీపీ నేతల నోటి దురుసుతనం, బూతుల పురాణం మాత్రం అస్సలు మారలేదనేది తాజా పరిణామాలు చూస్తుంటే స్పష్టమవుతోంది. ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు, కానీ ఆ ప్రశ్నించే విధానంలో కనీస సంస్కారం లేకపోతే.. ప్రజలు మరింత దూరం పెడతారనే నిజాన్ని వైసీపీ నేతలు విస్మరిస్తున్నారు.

    తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా ముందుకు సాగుతున్న తరుణంలో, వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా శుక్ర‌వారం నిరసన ర్యాలీలు చేపట్టింది. ఈ ర్యాలీలలో ఆ పార్టీ ముఖ్య నేతలు వాడిన భాష చూసి సామాన్య ప్రజలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. పెనుకొండ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, ప్రస్తుత మంత్రి సవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ‘నీ అబ్బా జాగీరా?’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడటమే కాకుండా, వ్యక్తిగత విషయాలను లాగుతూ చేసిన విమర్శలు ప్రతి ఒక్కరినీ అభ్యంతర పెట్టేలా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలపై, బెల్ట్ షాపులపై విమర్శలు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఒక మహిళా నేత అయి ఉండి, మరో మహిళా మంత్రిపై ఈ స్థాయి లోగ్రేడ్ భాష వాడటం వైసీపీ సంస్కృతిని మరోసారి ప్రశ్నార్థకం చేసింది.

    ap-politics-the-loose-tongues-of-ycp-leaders-wont-you-ever-change
    ap-politics-the-loose-tongues-of-ycp-leaders-wont-you-ever-change

    AP POLITICS: వైసీపీ కాపు టైగర్ గా చెప్పుకునే మాజీ మంత్రి అంబటి రాంబాబు

    మరోవైపు, వైసీపీ కాపు టైగర్ గా చెప్పుకునే మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం తన పాత అలవాటును మార్చుకోలేదు. గుంటూరులో జరిగిన నిరసనలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ‘వాడిని ఎప్పుడో తగలేశారు’ అంటూ తీవ్రంగా నోరు పారేసుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై, అది కూడా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండి ఇలాంటి పదజాలం వాడటం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఇక నగరి మాజీ ఎమ్మెల్యే రోజా అయితే.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ‘పరమచెత్త’, ‘పెద్ద క్యాబేజీ’ అంటూ ఎద్దేవా చేయడమే కాకుండా, మంత్రి లోకేష్‌ను విద్యాశాఖకు పట్టిన ‘శని’ అంటూ రెచ్చిపోయారు.

    ఈ తరహా నోటి దూల రాజకీయాలపై నేటితరం, ముఖ్యంగా జెన్ జీ యువత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. నేటి యువత కోరుకునేది అభివృద్ధి, ఉపాధి, నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే కానీ, ఇలాంటి వీధి రౌడీల తరహా భాషను కాదు. గత ఎన్నికల్లో వైసీపీ పతనానికి ప్రధాన కారణం ఆ పార్టీ నేతల నోటి దురుసేనని రాజకీయ విశ్లేషకులు నెత్తీ నోరూ బాదుకుని చెప్తున్నా, వీరు మాత్రం మారే ప్రసక్తే లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. విమర్శల పేరుతో బూతులు తిడితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్‌గా మారడం తప్ప, ప్రజల్లో మైలేజ్ రాదనే కనీస జ్ఞానాన్ని వైసీపీ నేతలు ఎప్పుడు గ్రహిస్తారో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.