Thu. Jul 30th, 2026

    Mushrooms: పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పుట్టగొడుగులను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం పుట్టగొడుగులు మార్కెట్లో చాలా విరివిగా లభిస్తున్నాయి.  వర్షాకాలం మొదలైంది అంటే పల్లెల్లో పంట పొలాల్లో కుప్పలు తెప్పలుగా పుట్టగొడుగులు వస్తుంటాయి అయితే చాలామంది పంట పొలాలలో లభించే ఈ పుట్టగొడుగులను తెలిసి తెలియక తినేస్తూ ఉంటారు వీటిలో కొన్ని ప్రమాదకరమైన పుట్టగొడుగులు కూడా ఉంటాయి. అందుకే వర్షాకాలంలో పుట్టగొడుగులు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

     

    వర్షా కాలంలో పంట పొలాలలో లభించే పుట్టగొడుగులు సాధారణ పుట్ట గొడుగులుగా ఉన్నప్పటికీ అవి విషపూరితమై ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం అందుకే వర్షాకాలంలో బయట లభించే పుట్టగొడుగుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఇక మార్కెట్లో కూడా లభించే పుట్టుగొడుగుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో మార్కెట్లో మనకు లభించే పుట్టగొడుగులను కొనుగోలు చేసేటప్పుడు అవి పొడిగా ఉన్నాయో లేదో గమనించాలి. పుట్టగొడుగులపై జిగటగా ఉండి, నల్లటి మచ్చలు పడినా లేదా దుర్వాసన వస్తున్నా వాటిని కొనుగోలు చేయకపోవడం మంచిది.

    Beware of wild mushrooms during rainy season know details
    Beware of wild mushrooms during rainy season know details

    Mushrooms: విషపూరితమైన అడవి పుట్టగొడుగులు..

    ఇక పుట్టగొడుగులను కొన్న తర్వాత వాటిని ఐదు నుంచి పది నిమిషాల పాటు వేడి నీళ్లలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉంచి ఆ తర్వాత వాటిని వండుకొని తినాలి అయితే పుట్టగొడుగులను పూర్తిగా ఉడికించి తినడం ఎంతో మంచిది. పుట్టగొడుగులను ఎక్కువగా ఉడికించినప్పుడు వాటిలో హానికర బ్యాక్టీరియాలు చనిపోయి ఎలాంటి ప్రమాదాలు తలెత్తవు లేదంటే వాంతులు కావడం విరోచనాలు వంటి తీవ్రమైన సమస్యలు వెంటాడతాయి. వర్షాకాలంలో పుట్టగొడుగులను నిల్వ చేసే విధానంలో కూడా జాగ్రత్తలను తీసుకోవాలి ప్లాస్టిక్ కవర్లో కాకుండా పేపర్ బ్యాగ్ లో ఉంచి రిఫ్రిజిరేటర్ లో భద్రపరిచాలి ఇలా చేయడ వల్ల పుట్టగొడుగులు చెడిపోకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. వర్షాకాలంలో లభించే అడవి పుట్టుగొడుగుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.