Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా భారీ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయని చెప్పుకున్నారు. కానీ, ఎందుకనో ఆ సినిమాలను శ్రీనిధి ఒప్పుకోకుండా హ్యూజ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి వదులుకుందని ప్రచారం కూడా జరిగింది.
అయితే, తెలుగులో అనుకోకుండా నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఆశించినంతగా కమర్షియల్ సక్సెస్ కలేదు. కానీ, సినిమాలో శ్రీనిధి పర్ఫార్మెన్స్ మాత్రం ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుంది. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

Srinidhi Shetty: ఈ కన్నడ బ్యూటీ చేతిలో ఉంది ఒక్క ఆదర్శ కుటుంబం సినిమా మాత్రమే.
ఇప్పుడు, ఈ కన్నడ బ్యూటీ చేతిలో ఉంది ఒక్క ఆదర్శ కుటుంబం సినిమా మాత్రమే. విక్టరీ వెంకటేష్ సరసన ఆయన భార్య పాత్రలో నటించింది. ఇప్పటికే, ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగానే బజ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 9న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో వెంకీ, త్రివిక్రమ్ లతో కలిసి శ్రీనిధి ఇంటర్వ్యూస్ ఇస్తోంది. అయితే, ఈ మధ్య కాలంలో వెంకీ సరసన నటించిన హీరోయిన్స్‌కి ఆ తర్వాత గొప్పగా చెప్పుకునే ఆఫర్సేవీ రాలేదు. ఇలాంటి, పరిస్థితుల్లో శ్రీనిధికి ఆదర్శ కుటుంబం తర్వాత తెలుగులో ఆఫర్స్ వస్తాయా లేదా అన్నది కాస్త డైలమాగానే ఉంది.
వాస్తవానికి, శ్రీనిధిలో అటు సీనియర్ హీరోలకి ఇటు యంగ్ హీరోలకి సరిపోయే ఫ్యూచర్స్ ఉన్నాయి. అందం, అభినయంలో కూడా ప్రశంసలు అందుకుంది. కానీ, ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే ఎవరికైనా అవకాశాలను తెచ్చిపెడతాయి. ఆ రకంగా చూస్తే ఇప్పుడు చేస్తున్న ఆదర్శ కుటుంబం హిట్ అవడం తప్పనిసరి. ఈ సినిమా హిట్ అవడంతో పాటు శ్రీనిధి పర్ఫార్మెన్స్‌కి మంచి పేరు..ప్రశంసలు దక్కాలి. అప్పుడే, తర్వాత సినిమాలలో ఛాన్స్ వస్తాయి. లేదంటే, త్వరగానే కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి, శ్రీనిధి శెట్టి ఫేట్ ఎలా ఉందో చూడాలి.

