Tue. Nov 10th, 2026

    Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్ టాపిక్‌గా మారింది. గడచిన 13 ఏళ్లుగా అన్యోన్యంగా సాగుతున్న పవన్ కల్యాణ్ – అన్నా లెజినోవా వివాహ బంధానికి తెరపడింది. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్లు ఈ దంపతులు ప్రకటించడం ఇటు అభిమానులను, అటు సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కష్టసుఖాల్లో తోడుగా ఉంటామనుకున్న జంట, ఇప్పుడు ఎవరి దారులు వారు చూసుకోవడం అందరినీ విస్మరణకు గురిచేస్తోంది.

    ఈ పరిణామం తలెత్తిన క్షణాల్లోనే అన్నా కొణిదెల ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పవన్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన వెనువెంటనే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ పూర్తిగా తొలగించి అందరికీ షాకిచ్చారు. వర్చువల్ ప్రపంచానికి పూర్తిగా దూరమయ్యేలా ఆమె తీసుకున్న ఈ సడన్ స్టెప్ ఇప్పుడు అనేక సందేహాలకు, చర్చలకు తావిస్తోంది. మీడియా దృష్టి నుంచి, పబ్లిక్ అటెన్షన్ నుంచి పూర్తిగా తప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

    tollywood-anna-takes-a-key-decision-immediately-after-parting-ways-with-pawan
    tollywood-anna-takes-a-key-decision-immediately-after-parting-ways-with-pawan

    Tollywood: ప‌వ‌న్ పక్కనే ఉండి అన్నీ తానై చూసుకున్నాఅన్నా లెజినోవా!

    నిజానికి, కొద్ది రోజుల క్రితం వరకు ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉందనే సంకేతాలే కనిపిస్తూ వచ్చాయి. పవన్ అనారోగ్య బారిన పడినప్పుడు అన్నా లెజినోవా స్వయంగా తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాకుండా, కేరళలో జరిగిన సుదీర్ఘ ఆయుర్వేద చికిత్స సమయంలోనూ ఆమె ప‌వ‌న్ పక్కనే ఉండి అన్నీ తానై చూసుకున్నారు. సుమారు 25 రోజుల పాటు అక్కడే కలిసి గడిపిన ఈ జంటను చూసిన అభిమానులు తెగ మురిసిపోయారు. మెగా కుటుంబంతోనూ అన్నా ఎంతో కలివిడిగా మెలుగడంతో, ఈ బంధానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అందరూ నమ్మారు.

    అయితే, ఇంతటి క్లోజ్ బాండింగ్ ఉన్నప్పటికీ సడన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణమేమిటనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇది పవన్ కల్యాణ్ మూడో వివాహం. గతంలో నందిని, రేణు దేశాయ్‌లతో పవన్ విడిపోయారు. ఇప్పుడు అన్నా నుంచి కూడా విడాకులు తీసుకోవ‌డంతో ప‌వ‌న్ నిర్ణ‌యం టాక్ ఆఫ్ ది నేష‌న్‌గా మారింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.