SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక స్వామివారి దర్శన విషయంలో భాగంగా ఇప్పటికే ఎన్నో రకాల సేవలను దర్శనాలను ప్రకటించారు. స్వామివారి దర్శనం కోసం ముందుగా టికెట్లు బుక్ చేసుకోకుండా తిరుమల వచ్చే భక్తుల కోసం SSD టోకెన్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఈ ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ చేస్తున్నారు. ఇలా 300 రూపాయల ఈ దర్శన టికెట్ల ద్వారా స్వామివారి దర్శనం త్వరగా పూర్తి అవుతుంది. అయితే నేడు ఈ టికెట్ల కోసం ఎదురుచూసే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. నేడు శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఈ ఎస్‌ఎస్‌డీ టోకెన్లను రద్దు చేసినట్లు తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు.బుధవారం దర్శనం కోసం మంగళవారం ఉదయం ఆరు గంటలకే పది వేల ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయగా.. వీరికి బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం అవుతుందని తెలిపారు.

SSD Tokens Cancelled:ప్రతి బుధవారం SSD టోకెన్లు రద్దు..
గురువారం మధ్యాహ్నం శుక్రవారం దర్శనానికి సంబంధించి టోకెన్లు జారీ చేయనున్నారు.టీటీడీ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చిన వారు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకునేలా ప్లాన్ చేసింది. ఇక పై ప్రతి బుధవారం SSD టోకెన్ రద్దు చేయనున్నారు.గత ఆరు నెలల్లో 7 వారాల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలిస్తోంది. ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ చేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అందుకే ఈ విషయాలను గమనించి భక్తుల తిరుపతి రావాలి అంటూ టిటిడి అధికారులు తెలియజేశారు.

