Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఈ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. ఈ అజ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల స్వామివారి ఆశీస్సులు మనపై ఉంటాయని చెప్పాలి.
ఇక అజ ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారాలు చేయటం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలకు పాత్రులు కాగలం.ఈ ఏడాది సెప్టెంబర్ 7, 2026న అజ ఏకాదశిని ఆచరించనున్నారు. అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తే పాప విముక్తి కలిగి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని పురాణ విశ్వాసం. ఇక ఈ ఏకాదశి రోజు తులసి మొక్క పూజ విషయంలో కొన్ని పరిహారాలు పాటించడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. అజ ఏకాదశి రోజున తులసి మొక్క సమీపంలో కూర్చుని ధ్యానం చేయడం మంచిదని చెబుతారు. అనంతరం “ఓం నమో భగవతే వాసుదేవాయ” లేదా “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాలను భక్తితో జపించవచ్చు. ఇలా చేయటం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించడమే కాకుండా మన ఇంట్లో సానుకూల వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడతాయి.

Aja Ekadashi 2026: తులసి కోట ముందు నెయ్యితో దీపారాధన..
ఈ ఏకాదశి రోజున విష్ణు పూజకు తులసిమాలను ఉపయోగించడం అనేది ఎంతో శుభప్రదమైనది తులసిమాలతో విష్ణు దేవుడిని పూజించడం వల్ల విష్ణుదేవుడి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక ఏకాదశి రోజు సాయంత్రం తులసి కోట ముందు నెయ్యితో దీపారాధన చేయటం శుభప్రదం ఈ చిన్న పరిహారాలను పాటించడం వల్ల విష్ణుదేవుడి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండటమే కాకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా మనపై ఉండటంతో ఆరోగ్యపరంగా ఆర్థికంగా కూడా అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

