Saturday spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మన తెలుగు మాసాలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ప్రతినెలా ఒక విశిష్టతను కలిగి ఉంది. ఇలా తెలుగు మాసాలలో శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఈ నెలలో పెద్ద ఎత్తున పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు వ్రతాలు చేయటం వల్ల దేవతల ఆశీర్వాదాలు మనపై ఉంటాయని భావిస్తారు. ఇకపోతే శ్రావణ మాసంలో సోమవారం, శుక్ర వారం, శనివారాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ఇక శ్రావణమాసంలో నేడు చివరి శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామికి ఇలా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.
శనివారం ఉదయం లేదా సాయంత్రం వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేయడం మంచిది. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా భక్తితో పూజ చేయడం వల్ల స్వామి వారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం ప్రాధాన్యం కలిగిన నెల. వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం. కనుక, ఈ నెలలో ఆయనను పూజిస్తే ఆయన అత్యంత సంతోషిస్తాడు. శ్రావణ శనివారం నాడు స్వామి వారి చిత్ర పటాన్ని అలంకరించి అనంతరం కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పానకం, వడపప్పు వంటి వాటిని నివేదన చేస్తారు. సాయంత్రం వీలైనంత మందికి తాంబూలాలు ఇవ్వాలి. ఇలా తాంబూలం ఇవ్వడం మంచిది.

Saturday spiritual: శ్రావణ మాసం శ్రావణ నక్షత్రం…
ఇక ఏడు శనివారలా వ్రతం చేసేవారు వ్రతం రోజు ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం మంచిది కాదు.ముత్తైదువులు వ్రతాలు చేస్తున్నప్పుడు రెండు పూటలా భోజనం చేయాలి. సాయంకాలం భోజనం మానకూడదనే నియమం ఉంది. వ్రతం చేస్తున్న ఆడవాళ్ళు తప్పనిసరిగా భోజనం చేయాలి. సాయం కాలాలు భోజనం చేయము అనడం ముత్తైదువులకు తగదని శాస్త్రం చెబుతుంది. ఇలా శ్రావణ మాసంలో వచ్చే చివరి శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేయడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు.

