Wed. Sep 2nd, 2026

    Black Dress: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా పూజ కార్యక్రమాలు జరిగినప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించడం ఆనవాయితీగా వస్తుంది. చాలామంది ఎరుపు పసుపు ఆకుపచ్చ దుస్తులను ధరించి పూజ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇలాంటి పూజా కార్యక్రమాలలో నలుపు రంగు దుస్తులు వేసుకోవటం పూర్తిగా నిషేధమనే చెప్పాలి. చాలావరకు పూజా కార్యక్రమాలలో పాల్గొనే సమయంలో నలుపు రంగు దుస్తులను వేసుకోరు. ఇలా నలుపు రంగు దుస్తులను వేసుకోకపోవడానికి గల కారణం ఏంటి దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఏంటనే విషయానికి వస్తే..

    జ్యోతిష్య శాస్త్రంలో నలుపు రంగును శనిదేవుడితో పాటు రాహు, కేతువులతో అనుసంధానించే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా నలుపు రంగు శని గ్రహానికి ప్రతీకగా భావిస్తారు.శని కర్మ, క్రమశిక్షణ, బాధ్యత, గంభీరతకు సంబంధించిన గ్రహం కావడంతో నలుపు రంగు దుస్తులను వేసుకొని పూజ చేయడం వల్ల దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది లేదంటే పూజ విఫలం అవుతుందని భావిస్తారు. అదేవిధంగా నలుపు రంగు దుస్తులు దుఃఖం, గంభీరత, వైరాగ్యం లేదా ప్రతికూలతకు ప్రతీకగా భావిస్తారు. నలుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండకపోవడం ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి అందుకే పూజ సమయంలో మనసుకు ప్రశాంతతను కలిగించే దుస్తులను వేసుకోవాలని సూచిస్తారు.

    Why avoid black dresses in Hindi pooja traditions know details
    Why avoid black dresses in Hindi pooja traditions know details

    పసుపు రంగు దుస్తులు ఆధ్యాత్మికతకు ప్రతీక..

    పూజ సమయంలో పసుపు రంగు దుస్తులను ధరించడం శుభం, జ్ఞానం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు. ఎరుపు రంగు దుస్తులు ధరించడం శక్తి, మంగళం, దైవిక శక్తికి ప్రతీకగా పరిగణిస్తారు. గులాబీ రంగు దుస్తులు ధరించడం ప్రేమ, ప్రశాంతత, సానుకూలతకు సూచికగా భావించే సంప్రదాయాలు ఇక పూజలో తెలుపు రంగు దుస్తులు ధరించడం పవిత్రత, ప్రశాంతత ఉంటుంది అందుకే పూజ సమయాలలో ఈ రంగు దుస్తులను మాత్రమే ధరించడం శుభప్రదం అని చెప్పాలి. ఇక నల్లని దుస్తులు అన్ని పూజా కార్యక్రమాలలో ధరించకూడదని నియమం లేదు కొన్ని పూజా కార్యక్రమాలకు నలుపు రంగు దుస్తులను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే కొన్ని కుటుంబ సాంప్రదాయాల ప్రకారం కూడా వారి వస్త్రధారణ ఉంటుందని చెప్పాలి.