Wed. Aug 12th, 2026

    Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో ఎంతో ఆరోగ్యకరమైన వాటిలో జామ పండు ఒకటి. జామా పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది.జామ పండు రుచితో పాటు విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆరోగ్యకరమైన పండుగా పేరుగాంచింది. ముఖ్యంగా విటమిన్ సి, ఫైబర్ ఉండటం వల్ల జామను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. జామ పండు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ కొందరు మాత్రం జామ పండుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి జామ పండును ఎవరు తినకూడదు అనే విషయానికి వస్తే..

    జామలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సాధారణంగా మేలు జరుగుతుంది. కానీ ఇప్పటికే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు  జామ తింటే అసౌకర్యం కలగవచ్చు. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకపోవడం మంచిది.జామపండులో పొటాషియం, విటమిన్ C స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.

    Guava is healthy but these people should avoid it know details
    Guava is healthy but these people should avoid it know details

    Guava fruit: ఇదంతా సమస్యలతో బాధపడుతున్న వారు..

    మధుమేహంతో బాధపడే వారు కూడా జామ పండును ఎక్కువగా తినకూడదు.జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉన్నప్పటికీ, మితిమీరి తింటే అందులోని సహజ చక్కెరల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో మార్పులు రావచ్చు. అందుకే రోజుకు ఒక చిన్న జామ పండు తినటం మంచిది.జామపండ్లలో విటమిన్ సి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి 3-4 జామపండ్లను తింటే, శరీరంలో ఫైబర్ పరిమాణం పెరిగి లూజ్ మోషన్స్ లేదా విరేచనాలకు కూడా దారి తీయొచ్చు. ఇక చాలామంది పంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా దంత సమస్య ఉన్నవారు గట్టిగా ఉండే పచ్చి జామకాయలను నమిలినప్పుడు పంటి నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే జామ గింజలు పండ్ల సందుల్లో ఇరుక్కుని అసౌకర్యాన్ని కలిగిస్తాయి  కనుక పంటి సమస్య ఉన్నవారు పచ్చి జామ పనులకు దూరంగా ఉండటం మంచిది.