Wed. Jun 10th, 2026

    TDP PARTY: ఆంధ్రప్రదేశ్‌లో మరో రాజకీయ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి క్షేత్రస్థాయిలో సత్తా చాటేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ రూట్ మ్యాప్‌తో సిద్ధమయ్యారు. రాబోయే మూడు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ పరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన.. శ్రేణుల్లో మునుపెన్నడూ లేని విధంగా జోష్ నింపే పనిలో పడ్డారు. అమరావతి వేదికగా జరిగిన తాజా సమీక్షలో బాబు మార్క్ వ్యూహాలు ఇప్పుడు తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

    ఈసారి ఎలాగైనా క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తుగా మార్చాలని డిసైడ్ అయిన చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇకపై కుప్పం వ్యవహారాలను తానే స్వయంగా పర్యవేక్షించబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి రెండు నెలలకోసారి నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్‌కు అందుబాటులో ఉండనున్నారు. ఇదే సమయంలో కుప్పం నియోజకవర్గ కన్వీనర్ శ్రీకాంత్‌ను రాష్ట్ర స్థాయి బాధ్యతల్లోకి ప్రమోట్ చేయడం ద్వారా.. అటు నియోజకవర్గాన్ని ఇటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ లైన్‌ను ఒకేతాటిపైకి తెచ్చేందుకు రూట్ క్లియర్ చేశారు.

    the-path-is-clear-for-chandrababu-the-next-three-months-will-be-a-trial-by-fire-for-them
    the-path-is-clear-for-chandrababu-the-next-three-months-will-be-a-trial-by-fire-for-them

    TDP PARTY: ఖుషీలో ఉన్న నేతలకు సీఎం చంద్రబాబు గట్టి షాకే ఇచ్చారు.

    ఇక నామినేటెడ్ పదవులు దక్కించుకుని ఫుల్ ఖుషీలో ఉన్న నేతలకు సీఎం చంద్రబాబు గట్టి షాకే ఇచ్చారు. పదవులు వచ్చాయి కదా.. ఇక ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కుదరదని, అసలైన అగ్నిపరీక్ష ఇప్పుడే మొదలైందని స్పష్టం చేశారు. నాయకులు ఎవరైనా సరే తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించాల్సిందేనని హుకుం జారీ చేశారు. పార్టీ లైన్ దాటి సొంత అజెండాలతో ముందుకెళ్తే ఊరుకునేది లేదనే సంకేతాలు పంపారు.

    మరో మూడు నెలల్లో రాబోయే స్థానిక పోరులో పార్టీని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో దూసుకుపోవాలని చంద్రబాబు ఆదేశించారు. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా వ్యూహాలు మార్చాలని, నియోజకవర్గాల వారీగా బాధ్యతలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. బాస్ ఇచ్చిన క్లారిటీతో రూట్ అయితే క్లియర్ అయిపోయింది కానీ.. ఈ మూడు నెలల గడువులో తమ సత్తా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు లీడర్ల భుజాలపై పడింది. ఈ అగ్నిపరీక్షలో ఎవరు పాస్ అవుతారు, ఎవరు వెనుకబడతారో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.