Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. పండ్లలో ఉన్నటువంటి పోషక విలువలు మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బొప్పాయి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం తెలిసిందే.ఇందులో విటమిన్-ఏ, విటమిన్-సి, ఫోలేట్, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే పాపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.
ఇక బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందనే సంగతి తెలిసిందే. ఇలా బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి బొప్పాయికి ఎవరెవరు దూరంగా ఉండాలి అనే విషయానికి వస్తే.. గర్భంతో ఉన్నటువంటి మహిళలు బొప్పాయి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాపైన్ గర్భస్రావం కావడానికి కారణం అవుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు బొప్పాయికి దూరంగా ఉండాలి.

Papaya: గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు..
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారు కూడా బొప్పాయికి దూరంగా ఉండటం చాలా మంచిది. బొప్పాయిలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇది శరీరానికి మేలు చేస్తుంది. అయితే అధిక పరిమాణంలో తీసుకుంటే కొందరిలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తుంది అందుకే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది. ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా బొప్పాయి తినకపోవడం చాలా మంచిది. గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా బొప్పాయిని తినకూడదు. బొప్పాయిలో ఉండే పొటాషియం సాధారణంగా గుండె ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లో దాని ప్రభావం భిన్నంగా ఉండవచ్చు. అందుకే బొప్పాయి తినకపోవడమే మంచిది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది.

