Wed. Aug 5th, 2026

    Curd: వర్షాకాలంలో ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతాయి కనుక చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే చాలామంది వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని బావిస్తారు.అందుకే వర్షా కాలంలో పెరుగు తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. మరి వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..

    వర్షాకాలంలో ఎలాంటి సందేహాలు లేకుండా నిరభ్యంతరంగా పెరుగు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే చాలా చల్లగా ఉన్న పెరుగును తినకుండా, కొద్దిసేపు బయట ఉంచి తినడం మంచిది. అదేవిధంగాతాజాగా తయారైన పెరుగును తీసుకోవాలి. ఇకజలుబు, గొంతు నొప్పి లేదా సైనసైటిస్ వంటి సమస్యలు ఉన్న వారికి చల్లటి పెరుగు అసౌకర్యంగా అనిపిస్తుంది అందుకే ఫ్రిజ్లో పెట్టకుండా గది ఉష్ణోగ్రత వద్ద తయారైన పెరుగును తీసుకోవడం మంచిది.

    Is eating curd during mansoon season it's good for health know the benifits of curd
    Is eating curd during mansoon season it’s good for health know the benifits of curd

    Curd: పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

    పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రోబయాటిక్స్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. పాలు పెరుగు వంటి పదార్థాలలో క్యాల్షియం అధికంగా ఉన్న నేపథ్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పళ్ళు బలంగా ఉండడానికి సహాయపడుతుంది అదేవిధంగా ప్రోటీన్ అధికంగా కలిగి ఉంటుంది. పెరుగు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో వర్షాకాలంలో కూడా పెరుగును పక్కన పెట్టకూడదని నిపుణులు చెప్తున్నారు.ఆరోగ్యంగా ఉన్న పెద్దవారు సుమారు 100–200 గ్రాముల పెరుగును రోజుకు తీసుకోవచ్చు. మధుమేహం ,ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు వైద్యుడి సలహా మేరకు పెరుగు తీసుకోవడం మంచిది.