Vastu Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాన్ని ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. మనం ఏ చిన్న పని మొదలుపెట్టిన వాస్తు ప్రకారమే ఆ పనిని పూర్తి చేయడం చేస్తుంటారు. అదేవిధంగా మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొన్ని వాస్తు పరిహారాలను పాటించటం వల్ల ఈ సమస్యలనుంచి కూడా బయటపడవచ్చని పండితులు చెబుతుంటారు. ఇకపోతే చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిన్న వాస్తు పరిహారాన్ని పాటించటం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఈ మూడు వాస్తు పరిహారాలను పాటించాలి. మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి అంటే గురువారం ఉదయం మన ఇంట్లో ఈశాన్య దిక్కున శుభ్రం చేసి పీట వేసి దానిపై బియ్యపు పిండితో ముగ్గు వేయాలి అనంతరం రాగి చెంబు తీసుకొని రాగి చెంబును శుభ్రంగా చేసి బొట్లు పెట్టుకోవాలి అందులోకి నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షతలు, యాలకులు, పువ్వులు వేసి ఆ పీటపై ఉంచాలి. ఇలా గురువారం ఈ రాగి చెంబును ఏర్పాటు చేసి సోమవారం ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటుంది.

Vastu Tips: ఈశాన్య దిక్కున ఆవు దూడ బొమ్మను ఉంచడం
గురువారం రోజున ఈశాన్య దిక్కున మట్టి ప్రమిదను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుంచి 7 గంటల వ్యవధిలో చేయటం మంచిది. అదేవిధంగా ఈశాన్య దిక్కున ఆవు దూడ బొమ్మను ఉంచడం చాలా మంచిదంట. గోమాతతో దూడ కలిసి ఉన్న బొమ్మను ఈశాన్యంలో ఉంచడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా గురువారం ఈ వాస్తు పరిహారాలను పాటించడంతో లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తుంది.

