Sreeleela: ఉస్తాద్ భగత్‌సింగ్ పై యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల ఇచ్చిన ఈ అప్‌డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇంతకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీపై ఈ బ్యూటీ ఇచ్చిన ఆ క్రేజీ అప్‌డేట్ ఏంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
గబ్బర్‌సింగ్ కాంబోలో ఉస్తాద్ భగత్‌సింగ్:
పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఏరేంజ్ లో హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇంతకాలానికి వీరి కాంబోలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే, ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నటించాల్సిన సీన్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇంకా కొద్దిపాటి చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, అది కూడా ఈ నవంబర్ కి పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తోంది.
తాజాగా శ్రీలీల నుంచి క్రేజీ అప్‌డేట్:
మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో ‘ధమాకా’ లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత ‘మాస్ జాతర’ మూవీ వస్తోంది. ఈ నెల 31న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ ఫుల్ పవర్ ప్యాక్డ్ గా ఉంటుందని, ఈ సినిమా గురించి మాట్లాడలంటే ఒకరోజు మొత్తం సరిపోదని చెప్పింది. అంతేకాదు, ఇంకా ఈ మూవీలో నా పాత్రకి సంబంధించి కొంచం షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపింది.

Sreeleela: ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశీఖన్నా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.
సమ్మర్ కానుకగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’:
దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా, ఈ సినిమాలో శ్రీలీలతో పాటు రాశీఖన్నా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల వచ్చిన OG మూవీతో పవన్ కళ్యాణ్ భారీ హిట్ అందుకున్నారు. ఇక త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ని కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

