Fri. Jun 5th, 2026

    Peddi Movie: మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ` పెద్ది` ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ, ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ఇండ‌స్ట్రీలో తీవ్ర ఉత్కంఠ‌ను రేకెత్తించింది. అయితే, యూఎస్ ప్రిమియర్స్, అర్ధరాత్రి షోల నుంచి ఈ సినిమాకు మొదట మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. దీంతో మెగా అభిమానుల్లో కొద్దిగా టెన్ష‌న్ మొద‌లైంది. కానీ, సీన్ కట్ చేస్తే… మార్నింగ్ షోలు పడేసరికి కథ పూర్తిగా మారిపోయింది.

    సాధారణ ప్రేక్షకులు థియేటర్ల నుండి బయటకు వస్తూ సినిమా హిట్ అంటూ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా 1980ల నాటి పల్లెటూరి వాతావరణంలో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చరణ్ క్యారెక్టరైజేషన్ అందరినీ కట్టిపడేసింది. తన ఊరికి గుర్తింపు తీసుకురావడం కోసం ఒక సామాన్య యువకుడు చేసిన పోరాటం, అందులోని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. రామ్ చరణ్ వన్-మ్యాన్ షో చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగతా హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా చరణ్ యాక్టింగ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్‌ ఖాతాలో పక్కా కమర్షియల్ హిట్ పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

    peddi-movie-movie-first-day-collections
    peddi-movie-movie-first-day-collections

    Peddi Movie: పెద్ది సక్సెస్‌తో దాన్ని కూడా బ్రేక్ చేశాడు రెహమాన్.

    టాక్ మిక్స్‌డ్‌గా స్టార్ట్ అయినా, కలెక్షన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ రేంజ్‌లో వచ్చాయి. తాజాగా ఈ సినిమా మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలను నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. వరల్డ్ వైడ్‌గా తొలిరోజే ఈ చిత్రం ఏకంగా రూ. 135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఈ భారీ కలెక్షన్లతో రామ్ చరణ్ బాక్సాఫీస్ ఛాంపియన్ అంటూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

    ఇక ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత, రామ్ చరణ్ సోలో హీరోగా మరోసారి మొదటి రోజే వంద కోట్ల మార్క్‌ను దాటి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. టాక్ ఎలా ఉన్నా, కలెక్షన్ల పరంగా పెద్ది సృష్టించిన ఈ మాస్ ర్యాంపేజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక, వీకెండ్ కాబట్టి..ఈ మూడు రోజుల్లో కలెక్షన్స్ ఇంకా బాగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండవ సినిమాతోనూ దర్శకుడు బుచ్చిబాబు సానా అటు సినీ ప్రముఖుల నుంచి, ఇటు విశ్లేషకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటున్నాడు. మరో, ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన స్ట్రైట్ తెలుగు సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదనే విమర్శలుండేవి. పెద్ది సక్సెస్‌తో దాన్ని కూడా బ్రేక్ చేశాడు రెహమాన్.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.