Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ ఒకెత్తయితే, ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు, నటీనటుల పారితోషికాల గురించిన చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దాదాపు రూ. 250 కోట్ల నుండి రూ. 300 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ భారీ బడ్జెట్‌లో సింహభాగం కేవలం రెమ్యూనరేషన్లకే ఖర్చయిందనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

Peddi Movie: ‘పెద్ది’ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు పారితోషికం
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, ఈ ‘పెద్ది’ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. చరణ్ స్టార్‌డమ్‌కు ఈ రేంజ్ అమౌంట్ రీజనబుల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో డెబ్యూట్ ఇచ్చి, రెండో సినిమాకే మెగా హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన బుచ్చిబాబు సానకు కూడా నిర్మాతలు భారీగానే సమర్పించుకున్నట్లు టాక్. ఈ సినిమా స్క్రిప్ట్, టేకింగ్‌కు గాను ఆయనకు సుమారు రూ. 30 కోట్ల వరకు ముట్టినట్లు సమాచారం.
సినిమాకు మరింత గ్లామర్, బజ్ తీసుకురావడంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు అద్భుతమైన విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఇతర ముఖ్య నటీనటుల పారితోషికాల కోసమే మేకర్స్ దాదాపు రూ. 35 నుండి రూ. 40 కోట్ల వరకు వెచ్చించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది.

