Peddi Records: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ జాతర బాక్సాఫీస్ దగ్గర అధికారికంగా షురూ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తోనే థియేటర్లలో పూనకాలు తెప్పించింది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఉన్న హైప్‌ను నిజం చేస్తూ, ప్రీమియర్ షోల నుంచే వసూళ్ల వేటలో ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాయడం మొదలుపెట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పెద్ది సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో ఇతర పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే కలెక్షన్ల జోరు కాస్త నెమ్మదించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రామ్ చరణ్ మాస్ ర్యాంపేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో బుకింగ్స్ చాలా ఆలస్యంగా ఓపెన్ అయినప్పటికీ, మెగా ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తారు. కేవలం ప్రీమియర్స్ తోనే నైజాంలో దాదాపు 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ సినిమా ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక మాస్ గడ్డ సీడెడ్‌లో 3 కోట్ల మార్కును అందుకోగా, ఆంధ్రా వ్యాప్తంగా 10.7 కోట్ల రేంజ్ లో ఊచకోత కోసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.70 కోట్ల గ్రాస్‌తో పెద్ది బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది.

Peddi Records: ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్రీమియర్స్ తోనే దాదాపు 38 కోట్ల రేంజ్ లో గ్రాస్
ఇక పొరుగు రాష్ట్రాల్లోనూ పెద్ది హవా గట్టిగానే నడిచింది. కర్ణాటక బాక్సాఫీస్ వద్ద 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టగా, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 35 లక్షల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. దీనితో కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ అక్షరాలా 21 కోట్ల మార్కును తాకింది. అటు ఓవర్సీస్ లోనూ చరణ్ క్రేజ్ తో 17 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్రీమియర్స్ తోనే దాదాపు 38 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేసి పెద్ది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రీమియర్స్ తోనే ఈ రేంజ్ లో విధ్వంసం సృష్టించిన మెగా పవర్ స్టార్, ఇక మొదటి రోజు పూర్తి కలెక్షన్లతో ఎలాంటి మైండ్ బ్లోయింగ్ రికార్డులను క్రియేట్ చేయబోతున్నాడో అని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

