Thu. Jun 4th, 2026

    Peddi Movie Review: టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక చప్పగా సాగుతోంది. థియేటర్లలో మళ్లీ మునుపటి కళ తీసుకురావాలనే భారీ అంచనాలతో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నటనకు వందకు వంద మార్కులు పడే సినిమా ఇదే అంటూ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర రచ్చ రంభోలా చేస్తున్నారు. అయితే, సినిమా చూసి బయటకు వస్తున్న ఆడియన్స్ అందరూ ఒకే ఒక్క విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు పెద్ది టాక్ ఏంటి.. సినిమాకు ఉన్న ఆ పెద్ద మైనస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

    విజయనగరం జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన కుర్రాడు.. క్రికెట్ బ్యాట్ పట్టి తన ఊరికి గుర్తింపు తేవాలనుకోవడం, ఆ తర్వాత అనుకోకుండా కుస్తీ(రెజ్లింగ్) బరిలోకి దిగాల్సి రావడం అనే పాయింట్ చుట్టూ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ కథను అల్లుకున్నారు. కథ పరంగా ఇది చాలా రెగ్యులర్ లైన్ అయినప్పటికీ.. హీరో క్యారెక్టరైజేషన్, మాస్ ఎలివేషన్స్, ఇంటర్వెల్ బ్లాక్, ఎమోషనల్ క్లైమాక్స్‌ను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ తన యాక్టింగ్‌తో ప్రతీ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు.

    peddi-movie-review-thats-the-biggest-minus-of-the-movie
    peddi-movie-review-thats-the-biggest-minus-of-the-movie

    Peddi Movie Review: సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ కోసమే

    ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఒకే ఒక్క లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే.. ల్యాగ్, అనవసరమైన హీరోయిన్ ట్రాక్. సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ కోసమే అన్నట్టుగా ఉంది తప్ప, కథ ముందుకు సాగడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆమె చుట్టూ అల్లుకున్న లవ్ సీన్స్, కొన్ని అనవసరమైన కామెడీ ట్రాక్స్ సినిమా ఫ్లోను దారుణంగా దెబ్బతీశాయి. దీనికి తోడు దాదాపు 3 గంటల రన్ టైమ్ ఉండటం సినిమాకు మరో పెద్ద మైనస్‌గా మారింది.

    ఎడిటింగ్ టేబుల్ మీద కొద్దిగా శ్రద్ధ పెట్టి, ఆ హీరోయిన్ సీన్లన్నీ కట్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా, ఫాస్ట్‌గా ఉండేది. అక్కడక్కడ వచ్చే కొన్ని క్రింజ్ సీన్స్ కూడా ఆడియన్స్‌కు కాస్త సహనపరీక్ష పెడతాయి. మెయిన్ విలన్లతో పాటు జగపతిబాబు, శివరాజ్ కుమార్ లాంటి పెద్ద నటులు ఉన్నప్పటికీ.. వారి క్యారెక్టర్లను సరిగ్గా డెవలప్ చేయకపోవడం, కేవలం హీరో చుట్టూనే కథ తిప్పడం కూడా కొంతవరకు నిరాశ పరుస్తుంది.

    ఏ ఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మేజర్ సీన్లను బాగానే లేపింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉన్నాయి. డైరెక్టర్‌కు ఇది రెండో సినిమానే అయినా, రామ్ చరణ్ నుండి బెస్ట్ ఎమోషన్స్ రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. కొన్ని మైనస్ పాయింట్లు, లెంత్ ఎక్కువ అవ్వడం పక్కన పెడితే.. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో కోసం, క్లైమాక్స్ ఎమోషన్ కోసం థియేటర్ కి వెళ్లే ఆడియన్స్‌కు పెద్ది ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర చరణ్ స్టామినాతో ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించేలా కనిపిస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.