Wed. Jun 3rd, 2026
    Ramcharan's peddi movie public talk and review know detailsRamcharan's peddi movie public talk and review know details

    Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది. ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వెళ్లి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా చూసిన అభిమానులు సినిమా గురించి వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా జూన్ 3న వరల్డ్ వైడ్ ప్రీమియర్లు ప్రసారం అయ్యాయి. ఇలా ప్రీమియర్లు ప్రసారమవుతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా గురించి వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

    పెద్ది సినిమా రామ్ చరణ్ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ బాడీ బిల్డింగ్, ఆయన నటన అదిరిపోయాయి అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా కథలో చాలా ఎమోషనల్ డెప్త్ ఉందని, ఈ సినిమాకు హీరోయిన్ జాన్వీ కపూర్ నటన, ఆమె అందచందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పాటలు కూడా అదిరిపోయాయని ఏఆర్ రెహమాన్ బిజిఎం హైలైట్ గా ఉందని తెలుస్తోంది. ఇక అప్పల సూరి పాత్రలో జగపతిబాబు నటన మరో లెవెల్ లో ఉందంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

     

    ramcharans-peddi-movie-public-talk-and-review-know-details
    ramcharans-peddi-movie-public-talk-and-review-know-details

    Peddi Movie: రామ్ చరణ్ హిట్ కొట్టేసారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    ఇలా పెద్ది సినిమా పలు వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. వరుస ఫ్లాప్ సినిమాల అనంతరం రామ్ చరణ్ పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ అందుకోబోతున్నారని స్పష్టమవతుంది.. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తిస్థాయి రివ్యూ మరి కాసేపట్లో రానుంది. ఇక ప్రీమియర్లు చూసిన అభిమానులు మాత్రం రామ్ చరణ్ హిట్ కొట్టేసారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటలలో థియేటర్లలోకి రాబోతున్న పెద్ది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏ విధమైనటువంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఉప్పెన తర్వాత డైరెక్టర్ బుచ్చి బాబు రామ్ చరణ్ తో మరో హిట్ కొట్టారని చెప్పాలి.