Mangoes weight Loss: వేసవికాలం వచ్చింది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండ్లు మామిడి పండ్లు. మామిడి పండ్ల కోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తూ మామిడిపండ్లను ఎంతో ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు అయితే చాలామంది మామిడి పండ్లను తినడం వల్ల శరీర బరువు పెరుగుతారనే అపోహలో ఉంటారు. ఇలాంటి అపోహ కారణంగా చాలామంది మామిడి పండ్లను దూరం పెడుతూ ఉంటారు. మరి నిజంగానే మామిడి పండ్లు తినడం వల్ల శరీర బరువు పెరుగుతారా? ఇందులో నిజం ఎంత? మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారనే విషయంపై నిపుణుల అభిప్రాయం ఏంటి అనే విషయానికి వస్తే..
మామిడి పండ్లలో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలన్ని మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి దోహదపడతాయాయి. ఇక మామిడిపండ్లలో అధిక శాతం నీరు ఉండటం వల్ల మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుతుంది. మామిడిపండ్లలో విటమిన్ లు, ఫైబర్లు పుష్కలంగా ఉండటం వల్ల ఈ పండ్లను తినడానికి ఏమాత్రం సందేహాలు వ్యక్తం చేయాల్సిన పనిలేదు. ఇక మామిడి పండ్లలో చక్కర ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే శరీర బరువు పెరుగుతారని చాలామంది దూరం పెడుతున్నారు. అయితే ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
మామిడిపండ్లలో సహజ చక్కరలతో పాటు అధిక శాతం నీరు, విటమిన్లు ఉండటం వల్ల వీటిని తీసుకుంటే శరీర బరువు ఏమాత్రం పెరగరని, ఈ అపోహ కారణంగా శరీర బరువు పెరుగుతారని పండ్లను తినకుండా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఏ ఆహార పదార్థాలు అయిన మన స్థాయికి మించి తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతారు. ఆహార పదార్థాలను సరైన విధంగా, మితంగా తీసుకోవడం వల్ల మన శరీర బరువును పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇక శరీర బరువు పెరుగుతారనే అపోహ కారణంగా మామిడి పండ్లను దూరం పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇలా ఇష్టమైన పనులను తీసుకుంటూ ప్రతిరోజు వర్కౌట్స్ చేయటం వల్ల మన శరీర బరువును పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవచ్చు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తినొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
