Thu. Nov 13th, 2025

    Sreeleela: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అందం, అభినయం ఉంటే సరిపోదు. ఇక్కడ హీరోయిన్‌గా నిలబడాలంటే ఇండస్ట్రీలో ప్రముఖుల అండదండలు ఉండాలి. లక్ కలిసి రావాలి. అవకాశల కోసం లక్ తో పాటు ఫ్లాపుల్లో ఉన్నా ఆదుకునే దర్శకనిర్మాతలో లేక హీరోనో ఖచ్చితంగా వెనకాల ఉండాలి. అలా, ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ కెరీర్ లో హిట్స్ చిట్టా చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే వేళ్ళ మీద లెక్కపెట్టే హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి.

    కొన్ని సినిమాలు శ్రీలీల నటించిందంటే కూడా గుర్తు లేనివి ఉన్నాయి. అయినా, ఈ బ్యూటీ సౌత్ లో మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే, తమిళంలో పరాశక్తి అనే సినిమా చేస్తోంది. హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న శ్రీలీల త్వరలో కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్‌డేట్ ని ఇవ్వబోతోంది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి నుంచి లుక్ రివీల్ చేసి త్వరలో క్రేజీ అనౌన్స్‌మెంట్ రానుందని పోస్టర్ ని వదిలారు. ఇందులో శ్రీలీల ఏజెంట్ మిర్చి గా కనిపించబోతున్నట్టుగా వెల్లడించారు.

    sreeleela-as-agnet-mirchi-in-bollywood-new-project
    sreeleela-as-agnet-mirchi-in-bollywood-new-project

    Sreeleela: శ్రీలీల చేయని ఓ రఫ్ అండ్ ఠఫ్ క్యారెక్టర్..

    ఇప్పటి వరకు శ్రీలీల చేయని ఓ రఫ్ అండ్ ఠఫ్ క్యారెక్టర్ ని చేస్తున్నట్టుగా అయితే, మేకర్స్ హింట్ ఇచ్చారు. అంతేకాదు, ‘ఏజెంట్ మిర్చి’ అని పేరుకు తగ్గట్టే హాట్ హాట్ గానూ కనిపించనుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ లో చేయబోతున్నదని తెలుస్తోంది. ఇప్పటికే, హిందీలో చేస్తున్న రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. ఆషికి 3 పేరుతో రాబోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ కి పేరు కూడా మార్చారని టాక్ వినిపించింది. మరో, సినిమానూ మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్ ని కమిటైంది.

    ఇక, తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ఈ నెల 31వ తేదీ న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద చాలా అంచనాలున్నాయి. ఇంతకముందు రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా భారీ కమర్షియల్ హిట్ సాధించింది. ఆ తర్వాత మళ్ళీ, ఇద్దరికీ హిట్ దక్కింది లేదు. మళ్ళీ, ఇప్పుడు రాబోతున్న మాస్ జాతర సినిమాతో హిట్ కొడతామని చాలా నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి, ఏం జరుగుతుందో.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.