Mon. Jul 7th, 2025

    Vadibiyyam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంటి ఆడపడుచుకు పెళ్లి చేసి పంపిన తర్వాత ప్రతి ఏడాది పుట్టింటికి తనని పిలిచి తన కోడి బియ్యం పోసి పంపిస్తూ ఉంటాము. ఇలా తమ ఇంటి ఆడబిడ్డ దీర్ఘ సుమంగళీగా ఉండాలని భావించి ప్రతి ఏడాది తనకు ఒడి బియ్యం పోయడం మన హిందూ సాంప్రదాయాలలో ఆచారంగా మారిపోయింది. మరి ఆడపిల్లలకు వడి బియ్యం పోయడం వెనుక ఉన్నటువంటి కారణమేంటి ఇలా ఎందుకు పోస్తారనే విషయానికి వస్తే..

    odi-biyyam-significance-mahalakshmi
    odi-biyyam-significance-mahalakshmi

    మనిషి వెన్ను లోపల 72 వేల నాడులను ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.ఈనాడులు కలిసేచోట చక్రం వుంటుంది. విధంగా మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి.అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. చక్రం మధ్యభాగంలో “ఒడ్డియాన పీఠం” ఉంటుంది కనుక అమ్మాయిలు నడుము ధరించే ఆభరణాలను వడ్డానం అని కూడా పిలుస్తారు.పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి.అందుకే ఆడపిల్లలను ఆ ఇంటి మహాలక్ష్మిగా భావించి ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ గాజులతో పాటు వారికి నచ్చిన దుస్తులను పెట్టి వడి బియ్యం పోస్తాము.

    ఇలా ప్రతి ఏడాది ఆడపిల్లకు ఒడి బియ్యం పోవడం వల్ల తనని మహాలక్ష్మిగా భావించి తన పుట్టింటికి మంచి కలగాలని అలాగే ఈ ఒడి బియ్యం తీసుకొని అత్తారింటికి వెళ్తే అక్కడ కూడా మంచి జరగాలని భావించి ఇలాంటి సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు ఇప్పటికీ కూడా ఇంటి ఆడపడుచులకి ప్రతి ఏడాది ఒడి బియ్యం పోస్తారు. అలాగే మరికొందరు మూడు సంవత్సరాలకు ఒకసారి లేదంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇలా బియ్యం పెడుతూ ఉంటారు.