M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిదా బ్యూటీగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి..మిగతా హీరోయిన్స్ మాదిరిగా అందాల ఆరబోతకే పరిమితం కాకుండా, స్కిన్ షో లేకుండా మంచి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఫిదా, లవ్‌స్టోరీ, విరాట పర్వం, తండేల్, శ్యామ్ సింఘా రాయ్, అమరన్..ఇలా మనసుకు నచ్చిన కథల్లోనే కనిపించి క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అయింది.
ప్రస్తుతం, సాయి పల్లవి హిందీలో ‘ఏక్ దిన్’ అనే కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తోంది. అలాగే, ప్రతిష్ఠాత్మకమైన ‘రామాయణ’ మూవీలో సీత పాత్రను పోషిస్తోంది. ఇది రెండు భాగాలుగా రానుంది. అలాగే, ధనుష్ సరసన మరోసారి, మణి రత్నం రూపొందించనున్న మరో సినిమాను అంగీకరించింది. ఇలా, చేతి నిండా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ లో లెజండరీ సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించనున్న ఓ బయోపిక్ కూడా చేస్తుందని ప్రచారం జరిగింది.

M.S.Subbulakshmi: ఈ ప్రాజెక్ట్ నుంచి సాయి పల్లవి తప్పుకుందట.!
అయితే, తాజా సమాచారం మేరకు.. ఈ ప్రాజెక్ట్ నుంచి సాయి పల్లవి తప్పుకుందట. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలీదు గానీ, ప్రస్తుతం అంతటా వైరల్ అవుతోంది. ఇకపోతే, సాయి పల్లవిని రీప్లేస్ చేసిన ఆ బ్యూటీ రుక్మిణీ వసంత్ అని చెప్పుకుంటున్నారు. కాంతార 1 మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం, కన్నడ స్టార్ యష్ నటిస్తున్న క్రేజీ మూవీ టాక్సిక్ లో కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీని చేస్తోంది.
ఇలాంటి, క్రేజీ లైనప్ ఉన్న సమయంలో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ఎం ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో అవకాశం అంటే రుక్మిణి కి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరి, దీనిపై అధికారికమైన ప్రకటన ఎప్పుడు రానుందో చూడాలి. ఈ పాత్రను సాయి పల్లవి చేసినా, రుక్మిణి చేసినా వాళ్ళ కెరీర్‌లో ఓ గొప్ప చిత్రంగా నిలవడం ఖాయం అని చెప్పాలి. వీర్ద్దరిలో ఆ అదృష్ఠవంతురాలెవరో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటన ఇచ్చేవరకూ ఆగాల్సిందే.

