Thu. Jul 10th, 2025

    Kuberaa movie review:  ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. టీజర్, ట్రైలర్‌లతోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రేక్షకులు సినిమా చూసిన వెంటనే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకోవడంతో టాక్ బయటకు వచ్చింది. మొదటి రోజు ప్రీమియర్ షోల తర్వాత ట్విట్టర్‌ను ఒక రకంగా కుబేరే ఆక్రమించింది.

    ఈ సినిమాలో ధనుష్ నటనపై నెటిజన్లు విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన పోషించిన పాత్రను ఇతర స్టార్ హీరోలు చేయడం కష్టం అంటున్నారు. ధనుష్ అమాయకత్వంతో కూడిన భావోద్వేగాలపై ఎంతో అద్భుతంగా నటించాడని, ఇది ఆయనకు మరొక మెట్టు అవుతుందని చెప్పుకుంటున్నారు. నాగార్జున కూడా తన సీబీఐ ఆఫీసర్ పాత్రలో ఎంతో సహజంగా కనిపించాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సింపుల్ అయినా గంభీరంగా ఉంది అని విశ్లేషణలు వచ్చాయి.

    kubera-movie-review
    kubera-movie-review

    Kuberaa movie review: ఆయనకు కొత్త జానర్ అయినా కూడా

    శేఖర్ కమ్ముల గురించి చెప్పాలంటే.. ఆయనకు కొత్త జానర్ అయినా కూడా దీనిని హుందాగా తెరకెక్కించారని అంటున్నారు. కథ వ్రాయడానికి రెండేళ్లు పట్టిన దర్శకుడు తన పని పట్ల ఎంత నిబద్ధత చూపాడో తెరపై స్పష్టంగా కనిపిస్తోందని టాక్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్‌గా సాగుతోందని, ఒక్క బోరింగ్ సీన్ కూడా లేదని నెటిజన్లు చెబుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బలమైన ప్లస్ పాయింట్‌గా నిలుస్తోందని, ముఖ్యమైన సీన్లను అతని బీజీమ్ భారీగా ఎలివేట్ చేసిందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    నటీనటుల విషయానికి వస్తే, ధనుష్, నాగార్జునల కాంబినేషన్ స్క్రీన్‌పై అదిరిపోయిందని, రష్మిక పాత్రకు కూడా మంచి స్థానం దక్కిందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల రైటింగ్‌కు, డైరెక్షన్‌కు, అలాగే డీఎస్పీ మ్యూజిక్‌కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కొన్ని చోట్ల నిడివి ఎక్కువగా అనిపించినా.. కథనం ఎక్కడా కుంగిపోలేదని అభిప్రాయపడుతున్నారు.

    ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు చాలా హృద్యంగా ఉండటంతో ప్రేక్షకులు డబ్బుకు పూర్తి న్యాయం లభించిందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ‘కుబేర’కు చాలా బలమైన పాజిటివ్ టాక్ వస్తోంది. పూర్తి రివ్యూ విడుదల కాకముందే ప్రేక్షకుల్లో హైప్ పెరిగిపోతోంది. ఇది శేఖర్ కమ్ముల కెరీర్‌లో మరో ప్రత్యేకమైన విజయంగా నిలుస్తోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.