Thu. Jul 10th, 2025

    Tollywood Director: బ్లాక్‌బస్టర్ సినిమాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. తాజాగా వంగా తన గ్యారేజ్‌లోకి యూరోపియన్ క్లాసిక్ మినీ కూపర్ కార్‌ను తీసుకురావడంతో అభిమానుల దృష్టంతా అక్కడికే మళ్లింది. స్టాండర్డ్ కార్లకు భిన్నంగా, యునిక్ డిజైన్ ఉన్న ఈ కార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్‌కు పూజలు చేసి తీసుకెళ్లిన ఫోటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫోటోల్లో ఆయన సతీమణి పూజలో పాల్గొనడం, కార్ ముందు పూల అలంకరణ, తెల్ల రంగోలీ డిజైన్ ఉన్నాయి..

    వంగా ఎంపిక చేసిన మోడల్, అత్యంత స్టైలిష్‌గా కనిపిస్తున్న దృష్ట్యా ఇది Mini Cooper S లేదా JCW (John Cooper Works) మోడల్ అయి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్ల ధరలు రూ.42.7 లక్షల నుంచి రూ.55.9 లక్షల మధ్య ఉంటున్నాయి. అయితే వంగా వాహనం మెటాలిక్ గ్రీన్ షేడ్, నలుపు టాప్, స్పోర్టీ డిజైన్ బట్టి చూస్తే మొత్తంగా కలిపి 50 లక్షల పైమాటే ఉంటుందని అంచనా..

    have-you-seen-sandeep-vangas-new-car-there-seems-to-be-no-limit-to-style-and-class
    have-you-seen-sandeep-vangas-new-car-there-seems-to-be-no-limit-to-style-and-class

    Tollywood Director: మినీ కూపర్ ఎంపిక చేయడం ద్వారా

    మెర్సిడెస్, BMW లాంటి కార్లను సెలబ్రిటీలు తరచుగా ఎంచుకుంటూ ఉంటారు. కానీ వంగా మాత్రం ఈసారి మినీ కూపర్ ఎంపిక చేయడం ద్వారా “క్లాసిక్ అండ్ కాంపాక్ట్ లగ్జరీకి” పెద్ద ఊతమిచ్చారు. ఇది కేవలం ఒక కార్ కాదు… అతని టేస్ట్‌కు, స్టైల్‌కి అద్దం వేశాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

    ప్రస్తుతం సందీప్ వంగా ప్రభాస్ హీరోగా నటించనున్న ‘స్పిరిట్’ అనే హై-బజ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. అలాగే తన ప్రొడక్షన్ బ్యానర్ ‘భద్రకాళి పిక్చర్స్’ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో సెటప్ చేయడం కూడా మరో కీలక అడుగు. సినిమాల్లో రఫ్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్ చూపించే వంగా, తన రియల్ లైఫ్‌లో మాత్రం క్లాసీ, స్టైలిష్, వెసులుబడి వాతావరణాన్ని ఎంచుకున్నాడనే చెప్పాలి. మినీ కూపర్ ఎంచుకోవడం కూడా ఓ స్టేట్మెంట్ లానే మారింది.

    అన్ని పనుల్లోనే వంగా “ఆర్డినరీ”కి దూరంగా ఉంటాడనడానికి ఇది మరో ఉదాహరణ.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.