Thu. Jul 10th, 2025

    Vandana Kammula:  టాలెంట్‌తో పాటు సాధారణంగా చక్కటి మేకింగ్‌ స్టైల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం ‘కుబేర’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న వంటి స్టార్ కాస్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, కొత్త జానర్‌కు నిదర్శనంగా నిలిచింది. అయితే సినిమాపై ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు, శేఖర్ కమ్ముల కుటుంబం నుంచి కూడా ఆసక్తికరమైన స్పందనలు వస్తున్నాయి.

    శేఖర్ కమ్ముల గురించి ప్రతిఒక్కరికీ తెలుసు.. ఆయన వ్యక్తిగత జీవితం పూర్తిగా ప్రైవేట్. ఆయన భార్య, పిల్లలు ఎప్పుడూ మీడియా కెమెరాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా కుమార్తె వందన చాలా అరుదుగా బయట కనిపిస్తారు. కానీ తాజా ‘కుబేర’ సినిమా ప్రీమియర్ సందర్భంగా ప్రసాద్ ఐమ్యాక్స్ లో వందన హాజరై సినిమా చూసిన సంగతి తెలిసింది. సినిమా ముగిసిన తర్వాత వందన మాట్లాడుతూ.. “కుబేర చిత్ర బృందాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఊహించిన దానికి మించిన స్థాయిలో సినిమా ఉంది.”

    vandana-kammula-first-review-on-kuberaa-movie
    vandana-kammula-first-review-on-kuberaa-movie

    Vandana Kammula: సినిమాపై కుటుంబ సభ్యుల నుంచే మొదటి రివ్యూ

    ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాపై కుటుంబ సభ్యుల నుంచే మొదటి రివ్యూ వస్తుందని శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. మొదటి ఫిల్టర్ తన కుటుంబమే అని, భార్య, కుమార్తె సినిమాను చూసిన తర్వాత వారి అభిప్రాయం ఆధారంగా ఫలితం ఎలా ఉంటుందో అంచనా వేస్తానని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పిన సందర్భం ఇక్కడ గుర్తుకువస్తుంది.

    వందన గతంలో కూడా మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, ‘ఫిదా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై చర్చనీయాంశంగా మారారు. ఈ సారి ‘కుబేర’ ప్రీమియర్‌కు రావడం, సినిమా ముగిసిన తర్వాత రివ్యూ ఇవ్వడం చూస్తే.. వందనకు సినిమా రంగం పట్ల ప్రేమ కనిపిస్తోంది. తండ్రిని పోలిన వ్యక్తిత్వంతో వందన డైరెక్షన్ వైపు అడుగులు వేస్తారా? అనే ప్రశ్న అభిమానులను ఊహల్లో ముంచుతోంది.

    vandana-kammula-first-review-on-kuberaa-movie
    vandana-kammula-first-review-on-kuberaa-movie

    శేఖర్ కమ్ముల గతంలో చెప్పినట్లు.. తన సినిమాలకు సంబంధించి ఇంట్లోనే మొదటి జడ్జ్‌లు.. “భార్య, పిల్లలు సినిమాను చూసిన తర్వాతే ఆ సినిమా రిజల్ట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటా” అని చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వందన స్పందన, ‘కుబేర’ సినిమాకు పెద్ద బూస్ట్ అనే చెప్పాలి.

    ప్రముఖ దర్శకుల కుటుంబ సభ్యులు ఇలా పబ్లిక్‌గా స్పందిస్తే, దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. వందన కామెంట్, ‘కుబేర’ చిత్రం అందుకున్న హిట్ టాక్‌కు మరికొంచెం బూస్ట్ ఇచ్చినట్లయింది. ఇక అభిమానులు మాత్రం ఒకే మాట చెబుతున్నారు. “వందన డైరెక్షన్ వైపు వస్తే, తండ్రి శేఖర్ కమ్ముల తరహాలో మనకు మరో కొత్త కథలు చూడవచ్చు!”.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.