Mon. Jun 8th, 2026

    Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. వేసవికాలంలో దొరికే మామిడి పండ్లను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మామిడిపండు విషయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మామిడి పండ్లను రాత్రి పడుకోవడానికి ముందు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటు గనుక మీకు ఉన్నట్లయితే మీరు ఇబ్బందులలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

    నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి పడుకోవడానికి ముందు మామిడి పండు తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయని తెలియజేస్తున్నారు. మామిడిపండ్లలో ప్రోటీన్లు, ఫైబర్ లు విటమిన్ సి, ఎ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలాంటి పోషకాలు మామిడిపండ్లలో ఉండటం వల్ల రాత్రి పడుకోవడానికి ముందు తినటం మంచిది కాదు. ఈ పోషకాలు జీర్ణం అవడానికి సమయం పడుతుంది. తద్వారా జీర్ణక్రియ సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు రాత్రిపూట మామిడి పండ్లను తినకపోవడం చాలా మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

    Are you eating mangoes before bed  digestion problems are inevitable

    Mangoes:మామిడి పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు

     

    ఇక చాలామంది ఉదయం నిద్ర లేవగానే పరగడుపున మామిడిపండు తింటుంటారు ఇలా తినడం కూడా మంచిది కాదు. ఇక భోజనం చేసిన వెంటనే కూడా మామిడి పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. ఇక డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు మామిడిపండును పూర్తిస్థాయిలో దూరం పెట్టకపోయినా చాలా తక్కువ మోతాదులో మామిడి పండ్లను తినడం మంచిదని సూచిస్తున్నారు. ఇక డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలో కూడా మామిడి పండ్లను తినకపోవడం చాలా మంచిది.