Thu. Jul 10th, 2025

    R Madhavan: ఈ మధ్య కాలంలో నెలకు ముప్పై వేలు పెట్టి అద్దె ఇల్లు తీసుకోవడం సాధారణ ప్రజలకి భారం అవుతుంది. కానీ సెలబ్రిటీలు మాత్రం కొన్ని లక్షలలో అద్దె చెల్లించడం కామన్ అయిపోయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ భార్య సరిత ముంబయిలో ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఓ అపార్ట్‌మెంట్‌ను నెలకు రూ. 6.5 లక్షల అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్‌మెంట్ లీజ్ కోసం రూ. 39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిందని సమాచారం.

    బాంద్రా ప్రాంతం ముంబయిలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ బాలీవుడ్‌కి చెందిన అనేక ప్రముఖులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇల్లు పొందాలంటే ఖచ్చితంగా కోట్ల రూపాయలు అవసరమవుతాయి, లేదా లగ్జరీ లీజ్ డీల్స్ అవసరమవుతాయి.

    R Madhavan: కాజోల్‌తో కలిసి అతిథి పాత్రలో 

    మాధవన్ సినిమా విషయానికి వస్తే.. అతను ఇటీవల ‘మా’ అనే సినిమాలో కాజోల్‌తో కలిసి అతిథి పాత్రలో కనిపించాడు. అలాగే ఫాతిమా సనా షేక్‌తో కలిసి నటించిన ‘ఆప్ జైసా కోయి’ అనే రొమాంటిక్ మూవీ జూలై 2025లో నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

    అలాగే, అతను ఇటీవల ‘కేసరి చాప్టర్-2’ లో అక్షయ్ కుమార్, అనన్య పాండేతో కలిసి నటించగా, ‘హిసాబ్ బరాబర్’ అనే థ్రిల్లర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం జనవరి 24 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, ఖరీదైన ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించిన మాధవన్ దంపతులు తమ సినిమాలు, లైఫ్‌స్టైల్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.