Thu. Jul 10th, 2025

    Health:  క్యారట్‌ అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడే సహజ వస్తువు. విటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే క్యారట్ చర్మం నిగారింపు, ప్రకాశం, మెత్తదనం కోసం గొప్ప పరిష్కారంగా నిలుస్తుంది. చర్మంపై మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే తేమ శాతం సమర్థంగా ఉండాలి. క్యారట్ జ్యూస్ చర్మానికి తేమను అందించడంలో తోడ్పడుతుంది. మేకప్‌కి ముందు ఒక టేబుల్‌స్పూన్ క్యారట్ రసం, ఒక టేబుల్‌స్పూన్ కమలారసం మిక్స్ చేసి ముఖంపై 10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగితే తక్షణ ఫ్రెష్‌నెస్ తో పాటు మేకప్ స్టే కూడా మెరుగవుతుంది.

    పిగ్మెంటేషన్ తగ్గించేందుకు క్యారట్ ఫేస్ ప్యాక్:
    కావాల్సినవి:

    క్యారట్ జ్యూస్ – 2 టేబుల్‌స్పూన్లు

    ఓట్స్ పౌడర్ – 1 టేబుల్‌స్పూన్

    పసుపు – కొద్దిగా

    చక్కెర – 1 టేబుల్‌స్పూన్

    క్యారట్‌ను గ్రైండ్ చేసి రసం తీయాలి. దానిలో ఓట్స్ పౌడర్ జత చేసి పేస్ట్‌లా కలపాలి. తరువాత పసుపు, పంచదార జత చేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మృదువుగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

    health-carrot-magic-for-glowing-skin-natural-skincare-at-your-home
    health-carrot-magic-for-glowing-skin-natural-skincare-at-your-home

    Health: క్యారట్ జ్యూస్ చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది.

    పసుపు చర్మం టోన్‌ను మెరుగుపరచుతుంది. క్యారట్ జ్యూస్ చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. చక్కెర, ఓట్స్ స్క్రబ్‌లా పనిచేస్తూ మృత కణాలను తొలగిస్తాయి.

    ఇలాగే సప్తాహానికి రెండు సార్లు ఈ ప్యాక్ వాడితే, మీ చర్మం సహజంగా ప్రకాశవంతంగా మారుతుంది. ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు, ఇంట్లో తయారుచేసే ఈ ప్యాక్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేచురల్ బ్యూటీ కోసం క్యారట్‌ మీకు మంచి మిత్రం!

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.