Family Values: భారతదేశంలో ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది కేవలం వయసుతో, అనుభవంతో సంబంధం లేకుండా జరుగుతోంది. పెళ్లై ఏడాది కూడా కాకముందే కొందరు ఈ బంధాలకు దారితీస్తుంటే, 25-30 ఏళ్ల కాపురం చేసినవారు కూడా పక్క చూపులు చూస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఇది ఒక్కటే కాదు, ఎన్నో కారణాలతో ఇలా జరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
1. ఆర్థిక సమస్యలు:
వివాహేతర సంబంధాలు పెరగడానికి ముఖ్యమైన కారణాల్లో ఇది ప్రధానంగా చెప్పబడుతుంది. దాంపత్య జీవితంలో ఆర్థిక ఒత్తిడులు పెరిగితే, దంపతుల మధ్య మానసిక, శారీరక దూరం పెరుగుతుంది. అప్పట్లో ఎవరైనా ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి, తాత్కాలికంగా సాంత్వన కోసం ఇతర వ్యక్తిని ఆశ్రయించే అవకాశం పెరుగుతుంది.
2. శారీరక, మానసిక అవసరాల్లో అసంతృప్తి:
జీవిత భాగస్వామితో శారీరకంగా, మానసికంగా అనుబంధం లేకపోవడం కూడా మరో ప్రధాన కారణం. ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా, కేవలం బాధ్యతలతో సాగిన సంబంధాల్లో ఎక్కడో ఒక దశలో మనస్సు కలవకపోవడం వల్ల ఇతరులను ఆశ్రయించే దిశగా అడుగులు పడుతుంటాయి.
3. నమ్మకం లేకపోవడం, అనుమానాలు:
వివాహ బంధంలో ముఖ్యమైన అంశాలైన నమ్మకం, గౌరవం క్రమంగా తగ్గిపోతే.. ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరుగుతాయి. అప్పుడే టిట్ ఫర్ టేట్ మైండ్‌సెట్ తో భాగస్వామిని మానసికంగా దూరం చేసుకుని, మరో సంబంధం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

Family Values: సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ప్రభావం
4. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ప్రభావం:
ఈ కాలంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ విపరీతంగా విస్తరించడంతో, కొత్త పరిచయాలు తేలికగా ఏర్పడుతున్నాయి. ఆ పరిచయాలు చాటింగ్, డేటింగ్, చివరకు మితిమీరిన బంధాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వివాహేతర సంబంధాలకు మౌనంగా దోహదపడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
5. కొత్తదనం కోసం తపన .. “పాతొక రోత, కొత్తొక వింత” అనే భావన:
కొంతమంది జీవిత భాగస్వామిని పాత బంధంగా భావించి, కొత్తదనాన్ని అన్వేషిస్తూ పక్క బంధాల వైపు లాగబడుతున్నారు. “పండగ పూట పాత మొగుడేనా?” అనే సామెతను గుర్తుచేసేలా, కొత్త అనుభూతులు కోసం వెతుకుతూ శారీరికంగా, మానసికంగా పక్క బంధాలవైపు అడుగులు వేస్తున్నారని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
వివాహేతర సంబంధాలు అనేవి నెమ్మదిగా సమాజంలో పెరిగిపోతున్న ఒక గమనిక. దీని వెనుక వ్యక్తిగత అసంతృప్తి, మానసిక ఒత్తిడులు, పరిసరాల ప్రభావం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక కారకాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాక, సమాజంలో మారుతున్న విలువల ప్రతిబింబంగా కూడా పరిగణించవచ్చు.