Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ పాన్ ఇండియా సినిమా కాదా..? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో ఇదే చర్చ సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటికే, హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ పూర్తైంది. వీరమల్లు చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా సోనాక్షి సిన్‌హా, బాబీ డియో, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 24న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతోంది.
ఇక సుజీత్ దర్శకత్వంలో ఓజీ రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ కిస్సుల హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా షూటింగ్ పూర్తై శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గానే రిలీజ్ చేస్తున్నారు. ఇలా వీరమల్లు, ఓజీ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతుంటే, ఉస్తాద్ భగత్‌సింగ్ మాత్రం కేవలం రీజనల్‌గానే ప్లాన్ చేస్తున్నారట.

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్
గతంలో పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న క్రేజీ మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్‌కి నరేంద్ర మోదీ మాటలతో వచ్చిన పాపులారిటీ అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా ఎవరూ ఊహించని రేంజ్. ఇలాంటి సమయంలో ఉస్తాద్ కూడా పాన్ ఇండియా రిలీజ్ అయితే వచ్చే లాభాలు లెక్కపెట్టలేము. మరి హరీష్ తాను రాసుకున్న కథను ఎందుకు పాన్ ఇండియా సినిమాగా తీయడం లేదో.. అని ఫ్యాన్సే మాట్లాడుకుంటున్నారు.
ఇప్పటివరకూ ఎక్కడా కూడా ఉస్తాద్ భగత్‌సింగ్ పాన్ ఇండియా సినిమా అని ప్రకటించలేదు. బహుషా వీరమల్లు, ఓజీల రిజల్ట్ చూసేమైనా ప్లాన్ చేస్తారేమో అని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే అయితే పవన్ సినిమాలకి అన్నీ భాషలలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో డబ్ చేసినా మంచి హిట్ సాధిస్తుంది. మరి, ఎందుకు హరీష్ శంకర్ ఉస్తాద్ ని పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేయడం లేదు అన్నది తెలియాలంటే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వచ్చే వరకూ ఆగాల్సిందే. కాగా, త్వరలో మూవీ టీమ్ అంతా సాంగ్స్ షూట్ కోసం ఫారిన్ వెళ్ళబోతోంది.