Fe Male Singers: సంగీత ప్రపంచంలో గాయనీమణులు తమ గాత్రంతో కోట్లాదిమంది మనసులు గెలుచుకుంటూ, గౌరవం మరియు ఆదాయంలోనూ గణనీయంగా నిలుస్తున్నారు. వారు పాడే పాటలు యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫాంలలో కోట్లల్లో వ్యూస్ సంపాదిస్తూ సంగీత అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇప్పుడు మనం భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 10 లేడీ సింగర్స్ గురించి తెలుసుకుందాం:
1. శ్రేయా ఘోషాల్
భారతీయ గాన కోకిల శ్రేయా ఘోషాల్ ఒక్కో పాటకు రూ. 25-27 లక్షలు, లైవ్ కాన్సర్ట్‌లకు రూ. 40-45 లక్షలు ఛార్జ్ చేస్తారు. ‘బర్సో రే’, ‘దేవసేనా’, ‘సూసేకీ’ (పుష్ప 2) వంటి పాటలతో అభిమానులను మంత్రముగ్ధులను చేశారు.

2. సునిధి చౌహాన్
అద్భుత శబ్ద పటిమ కలిగిన సునిధి, ఒక్కో పాటకు రూ. 20-25 లక్షలు, కాన్సర్ట్‌కు రూ. 30 లక్షల వరకు తీసుకుంటారు. ‘ఢూమ్ మచాలే’, ‘బీడీ జలైలే’, ‘సరదాగా చందమామనే’ వంటి పాటలతో పేరు తెచ్చుకున్నారు.
3. కనికా కపూర్
బేబీ డాల్ వంటి హిట్ పాటల గాయనిగా ప్రసిద్ధి చెందిన కనికా ఒక్కో పాటకు రూ. 18-22 లక్షలు తీసుకుంటారు. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 50 కోట్లు.
4. నేహా కక్కర్
యూత్‌లో ఫేమస్ అయిన నేహా ఒక్కో పాటకు రూ. 10-15 లక్షలు, ఈవెంట్‌లకు రూ. 25-30 లక్షలు ఛార్జ్ చేస్తారు. ‘గర్మీ’, ‘మైల్ హో తుమ్’ పాటలతో హిట్స్ సాధించారు.
5. అల్కా యాగ్నిక్
90లలో హిట్స్‌కి మరొక పేరు అయిన అల్కా యాగ్నిక్ ఒక్కో పాటకు రూ. 12 లక్షలు, కాన్సర్ట్‌కు రూ. 15-20 లక్షలు తీసుకుంటారు.
6. నీతి మోహన్
మెలోడీ గాత్రంతో పేరు పొందిన నీతి మోహన్ ఒక్కో పాటకు రూ. 8-10 లక్షలు పారితోషికంగా తీసుకుంటారు.
7. తులసి కుమార్
‘తుమ్ జో ఆయే’ వంటి మెలోడీ హిట్స్‌తో గుర్తింపు పొందిన తులసి ఒక్కో పాటకు రూ. 5-10 లక్షలు, లైవ్ షోకు రూ. 8-10 లక్షలు తీసుకుంటారు.
8. ఆషా భోస్లే
లెజెండరీ సింగర్ అయిన ఆషా భోస్లే ఇప్పటికీ పాటలకు రూ. 5-8 లక్షలు, ఈవెంట్‌లకు రూ. 10-15 లక్షలు తీసుకుంటున్నారు.
9. శిల్పా రావు
తెలుగమ్మాయి శిల్పా రావు ‘చుట్టమల్లే’, ‘కావాలయ్యా’ లాంటి పాటలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఒక్కో పాటకు రూ. 5-10 లక్షలు తీసుకుంటారు.
10. మోనాలీ ఠాకూర్
వెర్సటైల్ గాయనిగా పేరొందిన మోనాలీ, ‘జరా జరా టచ్ మీ’, ‘సావర్‌లూన్’ వంటి పాటలతో గుర్తింపు తెచ్చుకొని, పాటకు రూ. 5-10 లక్షలు, లైవ్ షోకు రూ. 15 లక్షలు ఛార్జ్ చేస్తారు.
ఈ గాయనీమణులు సంగీతాన్ని నమ్ముకుని తమ ప్రతిభతో శిఖరాలను అధిరోహిస్తూ, సంగీత ప్రపంచంలో గొప్ప ముద్ర వేశారు.