2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించినా, రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు రాపాక వరప్రసాద్. అయితే, ఆ గెలుపు జోష్ ఎంతో కాలం నిలవలేదు. కాలక్రమేణా ఆయన వైసీపీ గూటికి చేరిపోయారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసాతో గత ఎన్నికల్లో ఏకంగా అమలాపురం పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేశారు. కానీ కూటమి దెబ్బకు రాపాక భారీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

Andhra Pradesh: వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాపాక
మరోవైపు కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా, చీరాల నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్‌గా ఆమంచి కృష్ణమోహన్‌కు మంచి పేరుంది. గతంలో ఇండిపెండెంట్‌గా గెలిచిన చరిత్ర ఆయనది. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆమంచి, గత ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకోకపోవడం, చీరాలలో ఉనికి చాటుకోవడం కష్టంగా మారడంతో ఆమంచి సైలెంట్ అయిపోయారు. ఆయన మళ్లీ వైసీపీలోకి రీ-ఎంట్రీ ఇస్తారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం ఊపందుకుంది. కానీ ఈ విషయంలో ఆమంచి నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు కాంగ్రెస్ జెండా మోయలేక, ఇటు వైసీపీ వైపు అడుగులు వేయలేక ఆయన మౌనాన్నే ఆశ్రయించారు. కాగా, రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు. కానీ ఈ ఇద్దరు సీనియర్ నాయకులు మాత్రం ప్రస్తుతం పొలిటికల్ గా ఎటూ తేల్చుకోలేని త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. రాబోయే రోజుల్లో వీరు తమ భవిష్యత్తు కార్యాచరణను ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? అనేది కాలమే నిర్ణయించాలి.

