Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు వచ్చే ఈ సంకటహర చతుర్దశి రోజు వినాయకుడిని పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి ఆటంకాలు మొత్తం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. సంకట అంటే ఆటంకాలు హర అంటే తొలగించేది అందుకే సంకటహర చతుర్దశి రోజు వినాయకుడికి పూజ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ సంకటహర చతుర్దశి రోజు పూజ ఎలా చేయాలి? ఉపవాస నియమాలు ఏంటి అనే విషయానికి వస్తే..
మన హిందూ క్యాలెండర్ ప్రకారం నెలలో రెండు చతుర్దశలు వస్తాయి.సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత, అంటే చంద్రుడి కళలు తగ్గే సమయంలో, కృష్ణ పక్షంలో వస్తుంది.ఇక వినాయక చతుర్థి అమావాస్య తర్వాత, అంటే చంద్రుడి కళలు పెరిగే సమయంలో, శుక్ల పక్షంలో వస్తుంది. దీన్ని సంపద, జ్ఞానం సిద్ధి కోసం ఆచరిస్తారు. అయితే సంకటహర చతుర్దశి రోజు పూజలు చేయడం వల్ల కష్టాలు ఆటంకాలు తొలగిపోతాయి. సంకటహర చతుర్దశి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని అనంతరం వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.

Sankatahara chaturthi: చంద్రుడి దర్శనం తర్వాత..
సంకటహర చతుర్దశి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండటం ఎంతో ముఖ్యం.రోజంతా దైవ నామస్మరణతో గడుపుతారు. సాయంత్రం, వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు, గరిక, ,స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములతో మాల తయారుచేసి పూజలు చేస్తారు. ఇక సాయంత్రం ఆకాశంలో చంద్రుడు కనిపించే వరకు ఉపవాసంలోనే ఉండాలి చంద్రుడి దర్శనం అనంతరం స్వామివారికి సమర్పించిన నైవేద్యాలను ప్రసాదంగా పిల్లలకు పంచి అనంతరం ఉపవాసాన్ని విరమించాలి. ఇలా పౌర్ణమి తర్వాత వచ్చే ఈ సంకటహర చతుర్దశి రోజు వినాయకుడికి పూజ చేయడ వల్ల మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి మంచి రోజులు వస్తాయని పండితులు చెబుతున్నారు.

