Mon. Aug 3rd, 2026

    Fat Lumps: సాధారణంగా చాలామంది మెడ, చెయ్యి కాలి భాగంపై గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా గడ్డలు ఏర్పడటం వల్ల చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి గడ్డలు రావడానికి కారణం ఏమిటి? ఇవి ప్రమాదకరమా? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే?ఈ కొవ్వు గడ్డలను లైపోమా అని అంటారు. ఇవి సాధారణ కొవ్వు గడ్డ. ఈ గడ్డలు చర్మం కింది భాగంలో ఉంటాయి. అయితే ఈ కొవ్వు గడ్డల విషయంలో పెద్దగా ఆందోళ చెందాల్సిన పని లేదు.

    ఈ కొవ్వు గడ్డలు ఎందుకు వస్తాయనే విషయానికి వస్తే..జన్యు పరంగా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ. అదే విధంగా ఈ గడ్డలు 40-60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా ఇలాంటి గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. మరి కొంతమందిలో అధికంగా బరువు పెరగడం వల్ల కొవ్వు కణాలు అక్కడ గుంపుగా చేరటం వల్ల అది గడ్డలా ఏర్పడుతుంది. వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని డాక్టర్లు సూచిస్తున్నారు.

    body fat lumps causes symptoms danger treatment know more details
    body fat lumps causes symptoms danger treatment know more details

    Fat Lumps: కొవ్వు గడ్డలు లక్షణాలు..

    ఇక ఈ గడ్డ సైజు పెద్దదిగా మారి నొప్పిగా ఉన్నప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఈ గడ్డలు మెత్తగా ఉంటాయి. పెద్దగా నొప్పి కూడా ఉండదు చర్మం కింద ఏర్పడటం వల్ల సులువుగా కదులుతుంది.ఎప్పుడైతే గడ్డ సైజు పెరిగి నొప్పిగా ఉంటుందో వెంటనే డాక్టర్ ను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇక ఈ కొవ్వు గడ్డలు రావడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే మన చర్మం కింద నూనె గ్రంథి బ్లాక్ అవుతుందో అలాంటి సమయంలో కూడా ఇలాంటి గడ్డలు ఏర్పడతాయి. థైరాయిడ్ డయాబెటిక్ వంటి సమస్యలతో బాధపడే వారిలోనూ హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా ఈ విధమైనటువంటి గడ్డలు ఏర్పడతాయి. ఇక చాలామంది అధిక ఒత్తిడితో బాధపడుతుంటారు అలాగే జంక్ ఫుడ్ తీసుకునే వారిలో కూడా ఇలాంటి గడ్డలు ఏర్పడతాయి. ఇక గడ్డ త్వరగా పెరిగినప్పుడు,నొప్పి, ఎరుపు, వేడిగా ఉండి ,గడ్డ గట్టిగా ఉండి కదలలేనప్పుడు,గడ్డ 5cm కంటే పెద్దగా ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి.