Sat. Jul 4th, 2026

    AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో రాజధాని అనే సెంటిమెంట్ చుట్టూ ఎంతటి హైడ్రామా నడుస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్న కొత్త స్ట్రాటజీలు, తెస్తున్న ‘మావిగన్’ లాంటి నినాదాలు ఓటర్లను ఆకర్షించడానికి బాగానే పనికొచ్చేలా ఉన్నాయి. ఎన్నికల వేదికలపై మైకులు పట్టుకుని కొత్త పేర్లు చెప్పడం, పొలిటికల్ నినాదాలు ఇవ్వడం రాజకీయ నాయకులకు చాలా ఈజీ. కానీ, లీగల్ స్క్రీన్‌ప్లే దగ్గరకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. కేవలం ఒక ఆర్డినెన్స్ ద్వారా లేదా అసెంబ్లీలో ఒక తీర్మానంతో అమరావతిని మార్చేసి, అక్కడ ‘మావిగన్’ జెండా పాతడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడే అసలు లీగల్ ట్విస్ట్ దాగుంది.

    విభజన సమయంలో పార్లమెంట్ ఆమోదించిన ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం’లో నవ్యాంధ్ర రాజధానిగా ‘అమరావతి’ పేరును అధికారికంగా లాక్ చేసేశారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం.. ఒకే అంశంపై కేంద్ర చట్టానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు మధ్య తేడాలొస్తే, ఎప్పుడైనా సరే ఢిల్లీ చేసిన చట్టానికే పవర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే, జగన్ అసెంబ్లీలో కూర్చుని ‘మావిగన్’ అని ఎంత మొత్తుకున్నా చట్టప్రకారం అది చెల్లని కాగితంతో సమానం. ఒకవేళ ఆయన తన పంతం నెగ్గించుకోవాలంటే.. ఢిల్లీ వెళ్లి పార్లమెంట్‌లో కొత్త సవరణ బిల్లు పాస్ చేయించుకోవాలి. ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఏ కేంద్ర ప్రభుత్వమూ ఆ సాహసం చేయదు కాబట్టి, ఇది దాదాపు అసాధ్యం.

    ap-politics-amaravati-vs-jagan-this-is-the-real-twist
    ap-politics-amaravati-vs-jagan-this-is-the-real-twist

    AP POLITICS: అమరావతి పేరును మార్చడం జగన్ తరం కాదనేది నగ్నసత్యం.

    మరోవైపు, అమరావతి అనేది కేవలం ఒక లోకల్ ఇష్యూ కాదు. అది గ్లోబల్ మార్కెట్‌లో ఒక క్రేజీ బ్రాండ్. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీకి వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది ‘అమరావతి’ అనే నిర్దిష్టమైన బ్రాండ్ నేమ్‌ను చూసే. ఇప్పుడు కేవలం రాజకీయ కక్షలతో ఆ పేరును మార్చి ‘మావిగన్’ అని పెట్టాలని చూస్తే, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లన్నీ కోర్టు బోనెక్కుతాయి. దేశ ప్రతిష్టను మసకబార్చే ఇలాంటి లీగల్ రిస్క్‌ను ఏ కేంద్ర ప్రభుత్వమూ అస్సలు ఎంకరేజ్ చేయదు.

    అన్నిటికంటే పెద్ద మైనస్ పాయింట్.. నాడు నమ్మి భూములిచ్చిన 29 వేల మంది అమరావతి రైతులు. రాజధాని మాస్టర్ ప్లాన్ మరియు ల్యాండ్ పూలింగ్ అగ్రిమెంట్స్ అన్నీ అమరావతి అనే లీగల్ ఐడెంటిటీతోనే జరిగాయి. ఆ ఉనికిని దెబ్బతీసి మావిగన్ తేవాలని చూస్తే చట్టపరమైన ఒప్పందాల ఉల్లంఘన కింద మళ్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు పడటం ఖాయం. గతంలో మూడు రాజధానుల ప్రయోగానికి కోర్టులు ఎలా బ్రేకులు వేశాయో చూశాం. సో.. ప్రాక్టికల్‌గా చూస్తే, ఈ మావిగన్ అనేది కేవలం తన వాళ్లను మభ్యపెట్టడానికి జగన్ వేస్తున్న ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమే తప్ప.. పార్లమెంట్ చట్టం అనే గట్టి లీగల్ గోడను దాటి అమరావతి పేరును మార్చడం జగన్ తరం కాదనేది నగ్నసత్యం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.