Technology: అక్టోబర్ లో భారత్ లోకి 5జీ ఇంటర్ నెట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధాని మోడీ చాలా గ్రాండ్ గా ఈ 5జీ సేవలని ప్రారంభించబోతున్నారు. జియో మొదటిగా ఈ 5జీ సేవలని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. ఈ 5జీ సేవల ద్వారా మొబైల్ ఇంటర్ నెట్ సేవలలో 10 రేట్లు వేగం ఉంటుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, బ్రిటన్ లలో నడుస్తున్నాయి.
ఇప్పుడు ఇండియాలోకి ఈ 5జీ సేవలు ప్రవేశించబోతున్నాయి. ఇంటర్ నెట్ యూజర్స్ కి ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి. అయితే ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ మొబైల్ డివైజ్ లని అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఎక్కువగా 5జీ సేవలలోకి మారడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపధ్యంలో అందుకు తగ్గట్లుగానే మొబైల్ ఉత్పత్తులని మార్కెట్ లోకి తీసుకొని రావాలి.
స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పటికే ఈ 5జీ సర్వీస్ మొబైల్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ఇక పూర్తి స్థాయిలో ఇంటర్ నెట్ టెక్నాలజీ 5జీలోకి వస్తే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 4జీ స్మార్ట్ ఫోన్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వీటిని త్వరగా వదిలించుకోవడానికి కంపెనీలు కూడా రెడీ అవుతాయి. ఈ నేపధ్యంలో 5జీ మొబైల్స్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. టెక్ మార్కెట్ ని స్టడీ చేసే నిపుణులు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నారు.
కంపెనీలు మార్కెట్ లో ఉన్న తమ 4జీ స్మార్ట్ ఫోన్స్ ని వీలైనంత వేగంగా సేల్స్ చేసి 5జీ మీద ఫోకస్ పెట్టె అవకాశం ఉంటుందని, ఈ నేపధ్యంలో ధరల్ని తగ్గించడంతో పాటు, భారీ ఆఫర్స్ ని కూడా ప్రకటించే అవకాశం ఉందని సైబర్ మీడియా రీసెర్చ్‌లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు అమిత్ శర్మ అంటున్నారు. స్టాక్ కి వేగంగా క్లియర్ చేయడంపై కంపెనీలు దృష్టి పెడతాయని అంటున్నారు. అయితే 5జీ పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రావాలంటే కనీసం ఏడాది సమయం అయినా పడుతుందని అంత వరకు 4జీ మొబైల్స్ ధరల తగ్గే అవకాశం ఉండకపోవచ్చని మరో టెక్ నిపుణులు ఫైసల్ కవూసా అంటున్నారు.
ఇవి కూడా ఆల్టర్ నేటివ్ గా మార్కెట్ లో ఉంటాయని అంటున్నారు. 5జీ టెక్నాలజీకి సంబంధించి టవర్స్ ఇన్స్టలేషన్ పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా ఒకేసారి చేయడం లేదు. ముందుగా 13 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే లలో ఈ సేవలని మొదటి దశలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతాలలో టవర్స్ ని రియలన్స్ అభివృద్ధి చేస్తుంది.
ఈ నగరాలలో సక్సెస్ అయిన తర్వాత రెండో దశలో భాగంగా చిన్న పట్టణాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే దేశ వ్యాప్తంగా ఈ 5జీ విస్తరించడానికి కనీసం రెండేళ్ళకి పైగా పడుతుంది. అంత వరకు మార్కెట్ లో4జీ మొబైల్స్ కి వచ్చే నష్టం ఏమీ ఉండదని, సేల్స్ తగ్గే అవకాశం ఉండొచ్చేమో కాని పూర్తిగా ధరలు పతనం అయిపోవడం అంటూ జరగదని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ 5జీ సేవలు వచ్చే నెల నుంచి సరికొత్త మార్పులని తీసుకోస్తాయని మాత్రం చెప్పొచ్చు.