Technology: గూగుల్ మ్యాప్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ కామర్స్, ఆన్ లైన్ ఫుడ్ డోర్ డెలివరీ బిజినెస్ పెరిగాక ఈ గూగుల్ మ్యాప్ మీద ఆధారపడే వారి సంఖ్య పెరిగింది. అలాగే గూగుల్ మ్యాప్ తెలియని వారు అడ్రెస్ తెలుసుకొని రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది అడ్వాన్స్ గా పని చేస్తూ కోట్లాది మందికి ఫోన్ ద్వారా మార్గనిర్దేశకం చేస్తుంది. ఈ జనరేషన్ అద్భుత ఆవిష్కరణలో ఈ గూగుల్ మ్యాప్ కూడా ఒకటని చెప్పాలి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ గూగుల్ మ్యాప్ ని కచ్చితంగా యూజ్ చేస్తారు.
ఇప్పుడు గూగుల్ మ్యాప్ సర్వీస్ లో సరికొత్తగా అప్డేట్ వచ్చింది. గూగుల్ మ్యాప్ త్రీడీ ఏరియల్ వ్యూతో అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని టెక్ దిగ్గజం అధికారికంగా ప్రకటించింది. గూగుల్ మ్యాప్ యూజర్స్ అందరూ ఇకపై త్రీడీ ఏరియల్ వ్యూ ద్వారా ఆ పరిసరాలలో ఉన్నట్లు ఫీల్ అవ్వొచ్చు అని పేర్కొంది. ఇక ఈ ఆప్సన్ ని గూగుల్ మ్యాప్ లో అరౌండ్ మీ అనే అప్సన్ లో వైబ్ ఫీచర్ ఉంటుంది. ఈ వైబ్ ఫీచర్ లో రియల్ టైం ప్రదేశాలు, చుట్టూ ఉన్న రెస్టారెంట్స్, ఇతర పరిసరాల్ని లైవ్ లో, ఫోటోల రూపంలో చూడొచ్చు.
అలాగే గూగుల్ లో సెర్చ్ రిజల్ట్ లో విజువల్ ఫార్వార్డ్ అనే అప్సన్ తో ప్రపంచంలో చూడాలనుకున్న ప్రదేశాలని లైవ్ వ్యూలో చూడొచ్చు. ప్రపంచంలో ఏదైనా ప్రదేశానికి వెళ్లాలని అనుకోని గూగుల్ లో సెర్చ్ చేస్తే అందులో ఈ లైవ్ వ్యూ ఆప్సన్ కూడా ఉంటుంది. దాంతో మీరు ఆ ప్రదేశాలలో ఉన్న ఫీలింగ్ ని అనుభవించడంతో పాటు, వాటి గురించి ఫోటో గ్రాఫ్ లని అందులో చూడొచ్చు. ఈ ఫీచర్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది. అలాగే గూగుల్ మ్యాప్ లో ఎమ్మార్సీవ్ వ్యూ ద్వారా త్రీడీ ఏరియల్ వ్యూ కనిపిస్తుంది. దాంతో మరింత సులభంగా వెళ్ళాలన్న గమ్యాన్ని తెలుసుకోవడంతో పాటు, అక్కడి వాతావరణం, ట్రాఫిక్, చుట్టూ ఉన్న భావనాలని ఐడెంటిఫై చేసి తెలుసుకోవచ్చు.
ఈ ఫీచర్ లో గూగుల్ ముందుగా ఐఓఎస్ యూజర్స్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ముందుగా ఈ ఫీచర్ ని లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యోలలో ప్రారంభిస్తుంది. అక్కడ ఎమ్మార్సీవ్ వ్యూ ని రెడీ చేసి యూజర్స్ ని టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎమ్మార్సీవ్ త్రీడీ ఏరియల్ వ్యూని వినియోగంలోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో గూగుల్ నావిగేషన్ ప్రదేశాలని గుర్తించడం మరింత సులభతరం అవుతుందని చెప్పొచ్చు.