Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చురుకుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలకి తన రూట్ ఏంటి అనేది చెప్పకనే చెప్పారు. అయితే వారాహి యాత్ర ఎప్పుడు మొదలుపెట్టేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించడానికి తనకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అలాగే వైసీపీ నాయకులు ఏం కాకూడదని కోరుకుంటుందో అది కచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు. అలాగే జనసైనికులు ఏం అవ్వాలని కోరుకుంటున్నారో అది కూడా జరుగుతుంది అని చెప్పారు.
దీని ద్వారా టీడీపీతో పొట్టు ఉండకూడదని వైసీపీ చేస్తున్న విమర్శలకి పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పాలి. ఇక అలాగే జనసైనికులు కోరుకుంటున్నట్లు కచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూడా కూర్చుంటా అని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అయితే ఇక్కడ వైసీపీకి మరో జనసేన, టీడీపీని విడగొట్టడానికి మరో అవకాశం కూడా దొరికింది. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడానికి ఇప్పుడు చంద్రబాబు సిద్ధంగా ఉంటారా అనేది వారి ప్రశ్న.
ఓ వైపు టీడీపీని రెచ్చగొడుతూ అలాగే జనసైనికులలో అనుమానాలు పెంచే ప్రయత్నం ఇలాంటి విమర్శలతో వైసీపీ టార్గెట్ చేస్తుంది. అయితే వైసీపీ గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దు అని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. తాను తీసుకునే నిర్ణయం కచ్చితంగా మీ అందరికి ఆమోదయోగ్యం అయ్యేది అవుతుందని చెప్పారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతో కలిసి వెళ్తానని క్లారిటీ ఇవ్వడం ద్వారా వైసీపీ మాస్టర్ ప్లాన్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ నేపధ్యంలో వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకి వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.