Spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత మహిళ నుదుటన సింధూరం పెట్టుకొని కాళ్లకు మెట్టెలు మెడలో మంగళసూత్రం వేసుకొని ఉంటారు. అయితే తన భర్త ఉన్నంతవరకు మెడలో మంగళసూత్రం తీసివేయరు. అయితే భర్త చనిపోయిన తర్వాత హిందూ సాంప్రదాయాల ప్రకారం మెడలో తాళితో పాటు కాలిమెట్టలు నుదుట కుంకుమ పసుపు కుంకుమలు పువ్వులను కూడా తీసివేస్తారు.
ఇలా భర్త చనిపోయిన మహిళలు తమ జీవిత కాలంలో తిరిగి మరోసారి పసుపు కుంకుమలు, పువ్వుల జోలికి వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. అయితే నిజంగానే భర్త చనిపోయిన మహిళలు వీటన్నిటికీ దూరం కావాలా శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే… శాస్త్ర ప్రకారం భర్త చనిపోయిన మహిళలు పువ్వులు కుంకుమ పసుపు పెట్టుకోకూడదని ఎక్కడ చెప్పలేదు.
ఒక మహిళ పుట్టినప్పటినుంచి పసుపు కుంకుమ పువ్వులను పెట్టుకుంటూ ఉంటుంది. భర్త వచ్చిన తర్వాత మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం పెట్టుకుంటారు. అయితే భర్త చనిపోయిన తర్వాత మహిళలు మెడలో మంగళసూత్రం కాలికి మెట్టెలు తీసివేయాలి అలాగే భర్త వచ్చిన తర్వాతే నుదుటిపై సింధూరం ఉంది కనుక భర్త చనిపోయిన తర్వాత అక్కడ మాత్రమే సింధూరం పెట్టుకోకూడదు కానీ పూర్తిగా పసుపు కుంకుమలకు అలాగే పువ్వులకు దూరం కాకూడదని ఎక్కడ చెప్పలేదు.అయితే పూర్వం నుంచి ఈ ఆచారాలను పాటించడం వల్ల అదే పద్ధతులను కొనసాగిస్తున్నారు తప్ప కుంకుమలను తీసివేయాలని ఎక్కడ వెల్లడించలేదు.