Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా 158 చిత్రం లాంఛింగ్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు, మెగాస్టార్ తనయులు హాజరయ్యారు. అలాగే, దర్శకులు వి.వి.వినాయక్, మల్లిడి వశిష్ఠ, నటుడు-నిర్మాత బండ్ల గణేష్ సహా పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. ఈ సినిమాను తమిళ అగ్ర నిర్మాణ సంస్థ కేవిన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ ఎంపికైయ్యాడు.
ఈ ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో తదుపరి చిత్రాన్ని బాబీతో చేస్తున్నాడు చిరు. వీరి కాంబోలో ఇంతకముందు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబో రిపీటవుతుండటంతో ఇప్పటి నుంచే ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలను రేకెత్తించింది.

Mega 158: మెగా సోదరులు ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో
ఇక, చిరు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే, అనస్వర రాజన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. కాగా, ఈ సినిమాను జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు బాబీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అతిథిగా రావడం..మెగా సోదరులు ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అభిమానులకే కాకుండా సినీ లవర్స్‌కి కూడా కన్నులవిందుగా అనిపించింది.
30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన మెగాస్టార్..
మెగా 158 మూవీ ఓపెనింగ్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా క్లాప్ తో మొదలైన సందర్భాన్ని చిరంజీవి ఎంతో ఆనందించారు. అంతేకాదు, 30 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా వచ్చి క్లాప్ కొట్టారు. ఇప్పుడు ఇదే సీన్ రివర్స్ అయ్యి ఓ స్టార్ హీరోగా, ఏపీ డిప్యూటీ సీఎం గా గౌరవమైన పదవిలో ఉండి..సమయం కేటాయించి ఈ కార్యక్రమానికి రావడం చిరుకి ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకొచ్చారు.
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే…
30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది – “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో
టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి… pic.twitter.com/HGBENbRtlp— Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2026

