Thu. Nov 13th, 2025

    Mass Jathara Review: మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ‘మాస్ జాతర’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల కాబట్టి, ‘ధమాకా’ కాంబోలో వస్తున్న సినిమా అని అంచనాలు మామూలుగానే రెట్టింపు స్థాయిలో ఉండటం సహజం. కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. గ్యారెంటీగా ప్రతీ ఒక్కరు ‘ధమాకా’ లాంటి హిట్ పక్కా అనుకున్నారు. మరి, అందరూ అనుకున్నట్టుగా ‘మాస్ జాతర’ హిట్టా..రొటీన్ రొట్టకొట్టుడులా జనాలకి చికాగు తెప్పించిందా..? అనేది ఇప్పుడు చూద్దాం.

    జనరల్‌గా రవితేజ సినిమా అంటే ఫక్తు మాస్ ఎంటర్‌టైనర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రవితేజ సినిమాలలో సీరియస్ సినిమాలు చాలా తక్కువ. ఆయన నుంచి వచ్చే సినిమాలలో కంప్లీట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే. ఆ కోవలోకే వస్తుంది తాజాగా వచ్చిన ‘మాస్ జాతర’. దర్శకుడు ఇందులో రవితేజని సీఆర్పీఎఫ్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాడు. ఇప్పటి వరకూ పోలీస్ పాత్రల్లో హీరోలను చూశాము. ఒకరకంగా ఇది కొత్త పాత్రే. కానీ, ఇందులో బలం లేదు. అసలు ఖచ్చితంగా చెప్పాలంటే కథలోనే బలం లేదు.

    రొటీన్ కథే ‘మాస్ జాతర’. గంజాయి పండించి వ్యాపారం చేసే పాత్ర నవీన్ చంద్రది. ఇతనితో ఈ వ్యాపారం చేయించేదెవరు..అని రవితేజ కనుక్కోవడం..దాన్ని అడ్డుకోవడమే మూలకథ. ‘డాకు మహరాజ్, ఘాటి ‘ సినిమాలలో ఉన్న పాయింట్ కూడా ఇదే. ఇలాంటి కథలు, ఫార్ములాలతో చాలా సినిమాలొచ్చాయి కాబట్టి, కథనం ఆసక్తికరంగా ఉంటేనే జనాలకి ఎక్కుతుంది. ఈ సినిమాకి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రతీ సీన్ ని ప్రేక్షకుడు ముందే ఊహించేస్తున్నాడు.

    mass-jathara-review-will-ravi-teja-score-another-hit
    mass-jathara-review-will-ravi-teja-score-another-hit

    Mass Jathara Review: శ్రీలీల ది చాలా కీలకమైన పాత్ర.

    ‘ధమాకా’ సినిమాలో మాదిరిగా శ్రీలీల ది చాలా కీలకమైన పాత్ర. కానీ, ఆ పాత్రను దర్శకుడు సరిగా మలచలేదు. తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసినా ఉపయోగల్ లేకుండా పోయింది. సినిమాలో ఎవరిగురించైనా మాట్లాడుకోవాలంటే అది ఒక్క నవీన్ చంద్ర పాత్ర గురించే. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ లో పెద్దగా మ్యాజిక్ లేదు. చక్రి ని గుర్తు చేశాడంతే. మొత్తంగా సినిమా ఆడియన్స్ ని బాగానే డిసప్పాయింట్ చేసిందనుకుంటే, అంతకంటే ఎక్కువగా డిసప్పాయింట్ అయింది మాత్రం చిత్ర యూనిట్.

    అసలే, రాజమౌళి ‘బాహుబలి ది ఎపిక్’ అంటూ వచ్చి పడ్డాడు. రెండు భాగాలను కలిపి ఒక భాగంగా రిలీజ్ చేస్తే అదేదో కొత్త సినిమా అన్నట్టుగా అందరూ థియేటర్స్‌కి ఎగబడుతున్నారు..ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దెబ్బ మాస్ మహారాజా ‘మాస్ జాతర’కి గట్టిగా తగిలింది కూడా. మొత్తానికి మరో ఫ్లాప్ ని రవితేజ, శ్రీలీల చక్కగా తమ ఖాతాలో వేసుకున్నారు. అదీ మ్యాటర్.

    ట్యాగ్‌లైన్: మాస్ ఆడియన్ కూడా షాకవ్వాల్సిందే

    రేటింగ్: 2.5

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.