Wed. Feb 4th, 2026

    Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ మూవీ మైత్రీ వారు నిర్మించిన మొదటి సినిమా. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఎన్‌టీర్ హీరోగా ‘జనతా గ్యారేజ్’, రామ్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ లాంటి సినిమా బ్లాక్ బస్టర్స్ నిర్మించి నిలదొక్కుకున్నారు.

    అప్పటి నుంచి అభిరుచిగల నిర్మాతలుగా మైత్రీ వారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు, స్థానం సంపాదించుకున్నారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాని సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ గుర్తింపు పొందింది. దీంతో టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలు, దర్శకులు ఈ సంస్థలో సినిమాలు చేయడానికి క్యూ కట్టారు. వీరు కూడా కథకి ఏ దర్శకుడు-హీరో సూటవుతారో ఆ కాంబోను సెట్ చేయడంలో అస్సలు వెనకాడటం లేదు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తే…ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరే నంబర్ 1 అని అనక తప్పదు. మరి, ఆ ప్రాజెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

    so-many-movies-from-mythri-movie-makers-they-are-number-1-in-the-industry
    so-many-movies-from-mythri-movie-makers-they-are-number-1-in-the-industry

    Mythri Movie Makers: 8 భారీ చిత్రాలను నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్

    ‘ఉస్తాద్ భగత్‌సింగ్’:

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ ఇది. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీఖన్నా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా! అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఓజీ’ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీపై భారీ అంచనాలుండగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఈ సమ్మర్ కి సినిమాను రిలీజ్ చేయనున్నారు.

    ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో వస్తోన్న ‘ఫౌజీ’:

    మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న క్రేజీ చిత్రాలలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ ఒకటి. ఇన్స్టా ఫేమ్ ఇమాన్వి ఈ మూవీతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఇదే, ఏడాది ‘ఫౌజీ’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    ఎన్‌టీర్-ప్రశాంత్ నీల్-మైత్రీ మూవీస్:

    ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ సినిమాలతో పాన్ ఇండియా వైడ్‌గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో గ్లోబల్ హీరోగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో క్రేజ్ సంపాదించుకున్న ఎన్‌టీర్ హీరోగా భారీ యాక్షన్ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ‘కాంతార 1’ ఫేమ్ రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. నందమూరి అభిమానుల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌లోనూ భారీ అంచనాలున్నాయి.

    ‘పెద్ది’:

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతోన్న మరో పాన్ ఇండియా సినిమానే ‘పెద్ది’. స్పోర్ట్స్ అండ్ విలేజ్ బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘పెద్ది’ సినిమాపై బుచ్చిబాబు ఫస్ట్ షాట్, ఫస్ట్ సింగిల్ ‘చిరికి చికిరి’ సాంగ్‌తో ఊహించని విధంగా అంచనాలను పెంచేశాడు. ఈ సినిమా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్ఠించడం ఖాయం.

    విజయ్ దేవరకొండ-‘రణబాలి’:

    విజయ్ దేవరకొండ హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోంది ‘రణబాలి’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల వచ్చిన టైటిల్ టీజర్ అమాంతం అంచనాలను పెంచేసింది. మైత్రీ వారి నుంచి వస్తోన్న మరో ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అని ఈ ఒక్క టీజర్‌తోనే అందరికీ అర్థమైపోయింది. అంతేకాదు, గత కొంతకాలంగా విజయ్‌కి హిట్ లేని విషయం తెలిసిందే. ‘రణబాలి’ మూవీతో మాత్రం భారీ హిట్ అని అనిపిస్తోంది.

    అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబో:

    మైత్రీ మూవీ మేకర్స్ సెట్ చేస్తున్న ప్రతీ కాంబోకి మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి మరో అరుదైన కాంబినేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్‌లది. ఈ కాంబోలో సినిమాను ప్రకటించినప్పటి నుంచి..అప్‌డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ వారు పాన్ ఇండియా సినిమాగా నిర్మించబోతున్నారు.

    ‘జై హనుమాన్’:

    ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకూ, కంప్లీట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన మైత్రీ మూవీస్.. ‘జై హనుమాన్’ మూవీని మాత్రం మైథలాజికల్ జోనర్‌లో నిర్మిస్తుండటం విశేషం. అంతేకాదు, ఇందులో హనుమంతుడిగా ‘కాంతార’ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పేరు సాధించుకున్న హీరో రిషబ్ శెట్టి నటిస్తుండటం విశేషం.

    క్లాస్ సినిమాల దర్శకుడితో రవితేజ ‘ఇరుముడి’:

    ‘నిన్నుకోరి’, ‘టక్ జగదీష్’, ‘మజిలీ’, ‘ఖుషి’.. లాంటి క్లాస్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ‘ఇరుముడి’ పేరుతో ఓ సినిమాను చేస్తున్నాడు. మైత్రీ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఇటీవల వదిలిన టైటిల్ గ్లింప్స్ అందరినీ బాగా ఆకట్టుకొని మంచి అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 2027లో సంక్రాంతికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే, ఈ ఏడాది కూడా రిలీజ్ కావచ్చు.

    మొత్తానికి ఇలా.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఫౌజీ’, ఎన్‌టీర్-నీల్ సినిమా (డ్రాగన్) వర్కింగ్ టైటిల్, ‘పెద్ది’, ‘రణబాలి’, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్‌ల సినిమా, ‘జై హనుమాన్’, ‘ఇరుముడి’ లాంటి 8 భారీ చిత్రాలను నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. అంతేకాదు, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టి గట్టి పోటీ ఇస్తున్నారు. వీరు నిర్మిస్తున్న సినిమాల లైనప్ చూస్తుంటే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వీరే నంబర్ 1 అనిపిస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.