Black Thread: సాధారణంగా చాలా మంది కాలికి నలుపు రంగు దారం కట్టుకోవడం మనం చూస్తుంటాము. ఇలా కాలికి నలుపు రంగు దారం కట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి చెడు దిష్టి ప్రభావం మనపై ఉండదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇలా ఇతరుల చెడు ప్రభావం మనపై ఉండకుండా ఉండటం కోసమే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా కాలికి నలుపు రంగు దారాన్ని కట్టుకుంటున్నారు అయితే పెళ్లయిన మహిళలు నలుపు రంగు దారాన్ని కట్టుకోవడం మంచిదేనా.. కట్టుకుంటే ఏం జరుగుతుంది అని విషయానికి వస్తే…
చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా కాలికి నలుపు రంగు దారాన్ని కడుతూ ఉంటారు ఇక మహిళలు అలాగే పెళ్లయిన వారు కూడా కాలికి నలుగురంగు దారం కట్టుకొని ఉంటారు. అయితే పెళ్లి జరిగిన మహిళలు నలుపును ధరించకూడదని జ్యోతిష్యులు చెబుతుంటారు నలుపు అశుభానికి సంకేతం. అందుకే పెళ్లి జరిగిన మహిళలు నలుపు రంగు బొట్టు అలాగే నలుపు రంగు దుస్తులను ధరించకూడదని చెబుతుంటారు.
ఈ క్రమంలోనే పెళ్లైన మహిళలు కాలికి నలుపు రంగు దారం కట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు.నిజానికి నలుపు రంగు శనిగ్రహానికి ఇష్టమైన రంగుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో నల్ల దారాన్ని కట్టుకుంటే శనిదేవుని ఆశీస్సులు అలాగే ఉంటాయి. అంతే కాకుండా రాహు, కేతువుల ప్రభావం కూడా మీపై ఉంటాయి. కొంతమంది జ్యోతిష్యులు వివాహిత స్త్రీలు ఖచ్చితంగా నలుపు దారాన్ని ధరించాలని చెబుతున్నారు. దీని వల్ల వారి జాతకంలో శని దోషం తొలగిపోతుందట..కాగా దీన్ని కొన్ని నియమాలతో ధరించాలి. వివాహిత స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తుండటం వల్ల నలుపు దారాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి నల్లదారాన్ని కాలుకు కట్టే బదులు చేతికి కట్టుకోవడం మంచిదే అని పండితులు చెబుతున్నారు.