Fri. Jun 12th, 2026

    Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి హఠాత్తుగా తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. అఫిడవిట్‌లో కోర్టు కేసుల వివరాలు దాచారంటూ ఆమెపై వచ్చిన ఆరోపణలను మీనాక్షి తీవ్రంగా ఖండించారు. తాజాగా హైదరాబాద్‌లో మీడియా ముందుకు వచ్చిన ఆమె, ఈ వివాదంపై స్పందిస్తూ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయం పూర్తిగా అన్యాయమైనదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ (ఫామ్ 26) వివాదంపై మీనాక్షి నటరాజన్ పక్కా క్లారిటీ ఇచ్చారు. ఫామ్ 26లో అడిగిన ప్రతి ఒక్క సమాచారాన్ని తాను పారదర్శకంగా పొందుపరిచానని, ఏ విషయాన్నీ దాచలేదని స్పష్టం చేశారు. “నా అఫిడవిట్ అంతా పబ్లిక్ డొమైన్‌లోనే ఉంది. నాపై అసలు క్రిమినల్ కేసే లేనప్పుడు, దాన్ని దాచాల్సిన అవసరం నాకేంటి? కేవలం లీగల్ నోటీసులు, కంప్లైంట్లను క్రిమినల్ కేసులుగా ఎలా పరిగణిస్తారు? ఫామ్ 26లో ఎక్కడా లీగల్ నోటీసుల ప్రస్తావన తీసుకురావాలని లేదు” అంటూ ఆమె రిటర్నింగ్ అధికారి తీరును తప్పుపట్టారు. చట్టప్రకారం తాను చేయాల్సినవన్నీ కరెక్ట్‌గా చేశానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

    politics-there-is-no-case-against-me-meenakshi-natarajan-drops-a-big-twist
    politics-there-is-no-case-against-me-meenakshi-natarajan-drops-a-big-twist

    Politics: సుప్రీంకోర్టుపైనే ఆశలు.. శుక్రవారం తేలనున్న భవితవ్యం!

    రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) తీవ్రంగా పరిగణించింది. ఈ అన్యాయమైన తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం తగ్గకుండా నేరుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మీనాక్షి స్పందిస్తూ.. “న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సుప్రీంకోర్టులో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, సరైన తీర్పు వస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం సుప్రీంకోర్టులో జరగబోయే విచారణపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.