Eyes: ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు బాధపడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. థైరాయిడ్ అనేది పలు కారణాలవల్ల సంభవించవచ్చు. థైరాయిడ్ ఉన్న వారిలో సాధారణంగా బరువులో మార్పులు, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా గ్రేవ్స్ డిసీజ్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారిలో కళ్ల లక్షణాలు తొలిదశలోనే కనిపించే అవకాశం ఉంటుంది. చాలామంది ఈ లక్షణాన్ని గుర్తించకపోవడం వల్ల థైరాయిడ్ సమస్యను గుర్తించలేకపోతున్నారు.
మన కళ్ళలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్ లక్షణమని చెప్పాలి.కళ్ల చుట్టూ నిరంతరంగా వాపు లేదా ఉబ్బరం కనిపించడం ఈ వ్యాధి మొదటి లక్షణం.విశ్రాంతి తీసుకున్నా లేదా సరైన నిద్రపోయినా తగ్గని ఉబ్బరం ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కళ్లలో ఇసుక ఉన్నట్లుగా అనిపించడం, పొడిబారడం లేదా కళ్ల వెనుక భాగంలో ఒత్తిడిగా అనిపించడం కూడా థైరాయిడ్ లక్షణాలనే చెప్పాలి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే థైరాయిడ్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో మంచిది.

Eyes: ధూమపానానికి దూరంగా ఉండటం మంచిది..
కంటిలో ఈ లక్షణాలు కనిపించినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే వ్యాధి తీవ్రత మరింతగా పెరిగి కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవాడు తరచూ కంటి పరీక్షలను కూడా చేయించుకోవడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ధూమపానం అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి తీవ్రత మరింత అధికమవుతుంది. అందుకే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ధూమపానానికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఇక కళ్ళల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం వల్ల పెద్ద సమస్య నుంచి మనం బయటపడవచ్చు.

