Naga Panchami: శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఎన్నో పండుగలు వ్రతాలు నోములు చేస్తూ మహిళలు భక్తులందరూ కూడా ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో వచ్చే మొదటి పండుగలను నాగపంచమి ఒకటి. నాగ పంచమి రోజు భక్తులందరూ కూడా ప్రత్యేకంగా నాగ దేవతకు పూజలు చేయడమే కాకుండా పుట్టకు వెళ్లి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా నాగపంచమి రోజు నాగదేవతకు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల కాలసర్ప దోషాలు ఉన్న తొలగిపోతాయని భావిస్తారు.
ఇకపోతే జాతకంలో కాలసర్ప దోషం ఉండటం లేదంటే కలలో పాములు కనిపిస్తూ వారిని వెంటాడుతున్నట్లు కనిపించడం అదేవిధంగా జాతకంలో రాహు కేతు దోషాలు ఉన్నా కూడా ఈరోజు ప్రత్యేకంగా నాగదేవతలను పూజించడం వల్ల ఈ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రత్యేకంగా నాగ దేవతకు పూజ చేసిన అనంతరం పుట్టకు వెళ్లి పాలు పండ్లు సమర్పించి పూజ చేయాలి అలాగే రాహుకేతు దోషం ఉన్నటువంటి వారు పుట్టలో నాగ పడగలను విడిచి పాలు పోసి పుట్టకు కొబ్బరికాయ కొట్టుకొని రావాలి.
ఇలా చేయడం వల్ల రాహుకేతు దోషాలు తొలగిపోవడమే కాకుండా కలలో మనకు పాములు కనిపించిన ఆ భయం తొలగిపోతుందని తెలుపుతున్నారు. అదేవిధంగా నాగ పంచమి రోజు మనకు తోచిన దాంట్లో దానధర్మాలు చేయడం ఎంతో మంచిది అలాగే ఈరోజు నేలను దుక్కి దున్న కూడదు అదేవిధంగా చెట్లను నరకకూడదు ఇలాంటి పనులను పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.