Thu. Jun 11th, 2026

    Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో అత్యంత భారీ అంచనాలతో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరి మల్టీ స్పోర్ట్స్ ప్లేయర్‌గా రామ్ చరణ్ చూపించిన విశ్వరూపానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దాంతో మొదటి వారం ముగిసేసరికి ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రేంజ్ లో వసూళ్లను సాధించింది.

    ఇండియాలో పెద్ది సినిమా తొలి వారంలోనే ఏకంగా రూ.187.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. జూన్ 3న జరిగిన ప్రీమియర్ షోల నుంచే రూ.18.50 కోట్లు రాబట్టి శుభారంభం అందుకున్న ఈ చిత్రం, మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.51.00 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత శని, ఆదివారాల వీకెండ్‌లో రూ.61.25 కోట్లతో బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ వైపు దూసుకెళ్లింది. ఇక వర్కింగ్ డేస్ అయిన సోమ, మంగళవారాల్లో రూ.22.05 కోట్లు, బుధవారం నాడు రూ.14.45 కోట్లు కలెక్ట్ చేస్తూ వారం రోజులు ముగిసేసరికి మొత్తంగా రూ.187.25 కోట్ల భారీ నెట్ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది.

    peddi-collections-charans-box-office-tsunami-here-are-the-first-week-collections
    peddi-collections-charans-box-office-tsunami-here-are-the-first-week-collections

    Peddi Collections: ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకు పైగా గ్రాస్ వసూలు.!

    సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, మధ్యలో ఒక చిన్న వివాదం ‘పెద్ది’ టీమ్‌ను చుట్టుముట్టింది. హీరోయిన్ జాన్వీ కపూర్‌ను కేవలం గ్లామర్ బొమ్మగానే చూపించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సాన వెంటనే స్పందిస్తూ క్షమాపణలు చెప్పడమే కాకుండా, సదరు సీన్లను సినిమా నుండి తొలగించి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ చిన్న అడ్డంకిని దాటుకుని కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంత బలంగా నిలబడటం విశేషం.

    ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందా అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. అయితే, ‘పెద్ది’ ఈ భారీ మైలురాయిని చేరాలంటే నార్త్ బెల్ట్‌లో మరింత పుంజుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం హిందీ మార్కెట్‌లో వసూళ్లు అంతంతమాత్రంగానే ఉండటంతో, రూ.1000 కోట్ల టార్గెట్ అందుకోవడం కొంచెం కష్టమేనని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఏదేమైనా చరణ్ మాస్ ర్యాంపేజ్‌తో థియేటర్లు మాత్రం కళకళలాడుతున్నాయి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.