Vastu Tips: సాధారణంగా మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజ విధానాలను పాటిస్తూ ఉంటాము అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వాటిని మన ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉంటాము ఇలా ఎంతోమందికి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను పూజా మందిరంలో పెట్టి పూజిస్తుంటారు అయితే చాలామంది ఇంట్లో శంకువు పెట్టుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. శంకు ఇంట్లో ఉండటం మంచిది కాదని భావిస్తుంటారు. మరి నిజంగానే ఇంట్లో శంఖం ఉండవచ్చా ఉంటే ఏ దిశలో ఉండాలి అనే విషయానికి వస్తే…
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిలో శంఖం కూడా ఒకటి సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించారు అదే సమయంలోనే శంకు చక్రాలు కూడా ఉద్భవించాయి కనుక ఈ శంకు చక్రాలు లక్ష్మీదేవికి తోబట్టువులని పండితులు చెబుతున్నారు. అందుకే వీటిని మనం మన పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన ఇంట్లో శంఖం కనుక పెట్టుకున్నట్లయితే దానిని ఈశాన్య దిశలో పెట్టి పూజించడం ఎంతో మంచిది.
ఈ విధంగా శంఖం ఈశాన్య దిశలో పెట్టడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. సుఖశాంతులు కూడా లభిస్తాయట. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశ ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉండాలని చెబుతున్నారు పండితులు. ఈ దిశలో పూజలు చేస్తాం కాబట్టి, తడిగా కాకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.అదేవిధంగా శంఖాన్ని ఆఫీసులో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఈశాన్య దిశ అంటేనే సంపదకు చిహ్నం. ఈ దిశలో ఏర్పాటు చేసిన శంఖం ఊదడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తరచూ పూజలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది.