Thu. Nov 13th, 2025

    WhatsApp: ప్రస్తుతం మన డిజిటల్ యుగంలో మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు పంపేందుకు అత్యంత ప్రముఖంగా వాడుతున్న మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. ఇది వినియోగదారులకు సులభంగా సమాచారాన్ని పంచుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే కొన్నిసార్లు పొరపాటున కొన్ని ముఖ్యమైన చాట్‌లను, మెసేజ్‌లను డిలీట్ చేస్తాం. తరువాత వాటిని తిరిగి పొందాల్సిన అవసరం తలెత్తుతుంది. ఈ తరహా పరిస్థితుల్లో మనకు ఉపయోగపడే విధంగా వాట్సాప్ ‘బ్యాకప్ & రీస్టోర్’ అనే ఫీచర్‌ను అందిస్తోంది.

    డిలీట్ చేసిన చాట్‌ను రికవరీ చేసుకోవచ్చా?
    వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు లేదా చాట్‌లను తిరిగి పొందాలంటే, ముందుగా మీరు బ్యాకప్‌ని సెట్ చేసుకుని ఉండాలి. ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది

    1. గూగుల్ డ్రైవ్ (ఆండ్రాయిడ్ ఫోన్లకు)
    2. ఐక్లౌడ్ (ఐఫోన్‌లకు)

    మీరు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసినట్లైతే, వాట్సాప్ ప్రతి రోజు లేదా మీరు సెట్ చేసిన సమయానికి అనుగుణంగా చాట్‌లను ఆటోమేటిక్‌గా బ్యాకప్ తీసుకుంటుంది.. ఇది చాట్‌లను రికవర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

    డిలీట్ చేసిన చాట్‌లను ఎలా తిరిగి పొందాలి?

    1. ముందుగా వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.

    2. తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి వాట్సాప్‌ను మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    3. మీరు వాడుతున్న ఫోన్ నెంబర్‌తో వాట్సాప్‌ను వేరిఫై చేయాలి.

    4. వేరిఫికేషన్ పూర్తయిన తర్వాత, “Restore” అనే ఆప్షన్ కనిపిస్తుంది.

    5. దాన్ని క్లిక్ చేస్తే, గత బ్యాకప్‌లో ఉన్న అన్ని చాట్‌లు తిరిగి రీకవర్ అవుతాయి.

    this-is-how-to-recover-deleted-messages-and-chats
    this-is-how-to-recover-deleted-messages-and-chats

    WhatsApp: మీరు డిలీట్ చేసిన చాట్ తిరిగి రావాలంటే

    మీరు డిలీట్ చేసిన చాట్ తిరిగి రావాలంటే, ఆ చాట్ బ్యాకప్ సమయంలో ఉండాలి. బ్యాకప్ తర్వాత వచ్చిన మెసేజ్‌లు డిలీట్ చేస్తే, వాటిని తిరిగి పొందలేరు. బ్యాకప్ ఫైల్ ఉనికిని కలిగి ఉండాలంటే, మీ గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో సరిపడిన స్పేస్ ఉండాలి.

    Settings → Chats → Chat Backup లొ వెళ్లి ఆటో బ్యాకప్‌ను యాక్టివేట్ చేయండి.

    మానవ తప్పిదం సహజం. కానీ ముఖ్యమైన సమాచారం పోకూడదు. అందుకే ప్రతి వినియోగదారుడు వాట్సాప్‌లో ఆటోమేటిక్ బ్యాకప్‌ను ఆన్ చేసి ఉంచడం చాలా అవసరం. ఒకవేళ మీకు అవసరమైన మెసేజ్‌లు పోయినట్లయితే, పై విధంగా వాటిని సులభంగా తిరిగి పొందవచ్చు. డేటా సేఫ్టీకి ఇది అత్యంత సమర్థమైన మార్గం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.